బాలాకోట్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించినప్పటికీ ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ భారత్‌పై తన పంతాన్ని మాత్రం వీడటం లేదు.
బాలాకోట్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించినప్పటికీ ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ భారత్‌పై తన పంతాన్ని మాత్రం వీడటం లేదు. భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ ఇండియాకు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధం కొనసాగుతుందని జైషే తీర్మానించింది.
ఈ మేరకు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. 2017 నవంబర్ 17న పాకిస్తాన్‌లోని ఒకారాలో జరిగిన సమావేశంలో జైషే ప్రతినిధులు తీర్మానం చేశారు. ఈ భేటీలో ఆ సంస్థ అగ్రనేతలు అబ్ధుల్ రవూఫ్ అస్ఘర్, మహ్మద్ మసూద్, అబ్దుల్ మాలిక్ తాహీర్‌లు ప్రసంగించినట్లు నిఘా సంస్థలు తెలిపాయి.
2018లో ఆరు రోజుల పాటు జైషే మొహమ్మద్‌కు చెందిన ‘షోబే తారఫ్’( డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంట్రడక్షన్’ 65 మంది ఉలేమాలతో సహా 700 మంది ప్రతినిధులతో 13 సమావేశాలు నిర్వహించినట్లు ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
