Asianet News TeluguAsianet News Telugu

Israel: ఇజ్రాయెల్ పార్ల‌మెంట్ ర‌ద్దు.. నాలుగేండ్ల‌లో ఐదోసారి ఎన్నిక‌లు !

Israel political crisis: ఇజ్రాయెల్ లోని సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. దీంతో నాలుగేండ్ల‌లో ఐద‌వ సారి ఇజ్రాయిల్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి, సంకీర్ణ ప్రభుత్వానికి రూపశిల్పి అయిన యాయిర్ లాపిడ్ ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి కానున్నారు. 
 

Israel political crisis: parliament dissolves, sets fifth election in four years
Author
Hyderabad, First Published Jun 30, 2022, 3:17 PM IST

Israel parliament dissolves-political crisis: ఇజ్రాయెల్ లో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ ఏ ఒక్క పార్టీకి రాక‌పోవ‌డంతో ఇదివ‌ర‌కు సంకీర్ణ ప్ర‌భుత్వం పాల‌న సాగించింది. అయితే, గురువారం జెరూసలేంలోని ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్‌లో పార్లమెంటును రద్దు చేసే బిల్లుపై ఓటింగ్ జ‌రిగింది. దీనికి అనుకూలంగా నిర్ణ‌యం రావ‌డంతో మ‌రోసారి ఇజ్రాయిల్ పార్ల‌మెంట్ ర‌ద్దు అయింది. మ‌రోసారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, నాలుగేండ్ల‌లో ఐదోసారి ఇజ్రాయిల్ పార్ల‌మెంట్ కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. అంత‌కుముందు జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి కూడా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాక‌పోవ‌డంతో ప‌లు పార్టీల‌తో క‌లిసి సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

సంవత్సరం క్రితం ప్రయోగాత్మక సంకీర్ణ ప్రభుత్వానికి ముగింపు ప‌లుకుతూ.. గురువారం నాడు పార్ల‌మెంట్ ర‌ద్దుకు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి, ప్ర‌స్తుత సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన యాయిర్ లాపిడ్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఇజ్రాయెల్‌లో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి అయిన నఫ్తాలి బెన్నెట్ నుండి బాధ్యతలు స్వీకరించ‌డంతో ఆయ‌న ఇజ్రాయెల్ ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టిన 14వ వ్య‌క్తిగా నిల‌వ‌నున్నారు.  పార్ల‌మెంట్ ర‌ద్దుకు సంబంధించిన ఓటింగ్ స‌మ‌యంలో లాపిడ్‌, నఫ్తాలి బెన్నెట్ లు ఇద్ద‌రు ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. కూర్చీలు మార్చుకునే స‌మ‌యంలో ఒరినొక‌రు ఆలింగ‌నంతో ప‌ల‌క‌రించుకున్నారు. ఓటింగ్ ముగిసిన త‌ర్వాత ట్విట్టర్‌లో “ధన్యవాదాలు.. నఫ్తాలీ..  నా సోదరుడు” అని లాపిండ్ పోస్ట్ చేశాడు. సుదీర్ఘకాలం నాయకుడు బెంజమిన్ నెతన్యాహును 12 సంవత్సరాల తర్వాత అధికారంలో ఉన్న సైద్ధాంతికంగా వైవిధ్యభరితమైన పార్టీల సంకీర్ణం, అరబ్ వర్గాన్ని చేర్చుకున్న మొదటి కూటమి ద్వారా తొలగించబడిన చారిత్రాత్మక చర్యలో ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం తర్వాత కుప్ప‌కూలింది.

ఇజ్రాయెల్ పార్ల‌మెంట్ కు నవంబర్ 1న కొత్త ఎన్నికలు జరగనున్నాయి. రెండు సంవత్సరాలలో దేశంలో నాలుగు ఎన్నికలు జరిగిన సుదీర్ఘ గ్రిడ్‌లాక్ కాలం తర్వాత ఇజ్రాయెల్ స్పెక్ట్రమ్‌లోని ఎనిమిది పార్టీలు ఏక‌మై సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఎంతోకాలం నిల‌బ‌డ‌లేక‌పోయింది. నేత‌న్యాహూ అవినీతి ఆరోప‌ణ‌లు, విచార‌ణ త‌ర్వాత నుంచి ఇజ్రాయెల్ రాజ‌కీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గత మూడేళ్లలో జరిగిన నాలుగు ప్రతిష్టంభన ఎన్నికలు, లంచాలు, మోసం మరియు నమ్మక ద్రోహానికి సంబంధించిన ఆరోపణలను నెతన్యాహు ఎదుర్కొంటున్నారు. 

మెజారిటీతో పాలక కూటమిని ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు సాధించడంలో పార్టీలు పదేపదే విఫలమవుతున్నందున ఇజ్రాయెల్ రాజకీయ సంక్షోభం కొన‌సాగుతూ వ‌స్తోంది.  రికార్డు స్థాయిలో  ఎన్నికలకు వెళ్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే లాపిడ్-బెన్నెట్ సంకీర్ణం రాజ‌కీయ‌ ప్రతిష్టంభనను తాత్కాలికంగా తొలగించింది. ఒక చారిత్రాత్మక చర్యలో ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఒక సంవత్సరం తర్వాత కుప్పకూలింది. దీనిపై సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం ఇజ్రాయిలీలకు గొప్ప వార్త అని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇక ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రిగితే ఏ పార్టీకి కూడా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ ల‌భించ‌క‌పోవ‌చ్చున‌ని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంటోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios