Israel Hamas War : 13 ఇజ్రాయెలీ, 12 థాయ్ బందీలను విడుదల చేసిన హమాస్ .. 25 రోజుల తర్వాత విముక్తి

13 ఇజ్రాయెలీ, 12 థాయ్ బందీలను 4-రోజులఒప్పందంలో భాగంగా హమాస్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసింది. 12 మంది థాయ్ బందీలను ఇప్పటికే హమాస్ విడుదల చేసినట్లు థాయ్‌లాండ్ ప్రధాని స్రెట్టా థావిసిన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Israel Hamas War : 13 Israeli, 12 Thai Hostages Released By Hamas As Part Of 4-Day Truce Dea ksp

13 ఇజ్రాయెలీ, 12 థాయ్ బందీలను 4-రోజులఒప్పందంలో భాగంగా హమాస్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసింది. 12 మంది థాయ్ బందీలను ఇప్పటికే హమాస్ విడుదల చేసినట్లు థాయ్‌లాండ్ ప్రధాని స్రెట్టా థావిసిన్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉగ్రవాద చెర నుంచి విముక్తి పొందిన బందీలను స్వీకరించడానికి థాయ్ ఎంబసీ అధికారులు సిద్ధంగా వున్నట్లు ప్రధాని వెల్లడించారు. 

ఆ ట్వీట్‌లో థావిసిన్ ఏమన్నారంటే.. ‘‘ ఇప్పటికే 12 మంది థాయ్ బందీలను హమాస్ విడుదల చేసినట్లు భద్రతా విభాగం, విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించాయి. ఎంబసీ అధికారులు మరో గంటలో రిసీవ్ చేసుకుంటారు. వారి పేర్లు, ఇతర వివరాలు తెలియాల్సి వుంది’’ అని థాయ్‌లాండ్ ప్రధాని మంత్రి పేర్కొన్నారు. 

ఈ రోజు గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణలో భాగంగా హమాస్, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 39 మంది పాలస్తీనియన్లకు బదులుగా పొరుగున ఉన్న ఈజిప్ట్‌కు 13 మంది ఇజ్రాయెలీ బందీల సమూహాన్ని అందించాలని మొదట నిర్ణయించారు. విడుదలైన 12 థాయ్ జాతీయులతో, దాదాపు రెండు నెలల తర్వాత 25 మంది నిర్బంధం నుండి బయట పడనున్నారు.

ఈ రోజు గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణలో భాగంగా హమాస్.. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 39 మంది పాలస్తీనియన్లకు బదులుగా పొరుగున ఉన్న ఈజిప్ట్‌కు 13 మంది ఇజ్రాయెలీ బందీల సమూహాన్ని అప్పగించాలని మొదట నిర్ణయించింది. విడుదలైన 12 మంది థాయ్ జాతీయులు సహా మొత్తం 25 మంది దాదాపు రెండు నెలల తర్వాత నిర్బంధం నుండి విడుదల కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఖైదీల మార్పిడి సమయంలో 12 మంది థాయ్‌లాండ్ ప్రజలు, 13 మంది ఇజ్రాయెలీలను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. 

నివేదికల ప్రకారం.. బందీలను రెడ్‌క్రాస్‌కు అప్పగించారు. రఫా - గాజా సరిహద్దుల మీదుగా వీరంతా ఈజిప్ట్‌కు చేరుకుంటారు. ఇజ్రాయెల్‌కు తిరిగి రావడానికి కొంతమంది ఇజ్రాయెలీ బందీలను అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీకి అప్పగించారు . ఈ మేరకు హమాస్‌కు సన్నిహితంగా ఉన్న రెండు మూలాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ నివేదించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios