న్యూఢిల్లీ:  నీరవ్ మోడీ సోదరుడి కోసం ఇంటర్ పోల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. నేహల్ దీపక్ ను అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

బెల్జియం దేశస్తుడైన నేహల్ న్యూయార్క్ లో నివాసం ఉంటున్నారు. నీరవ్ మోడీ డైమండ్ కంపెనీకి నేహల్  మోడీ గతంలో డైరెక్టర్ గా పనిచేశాడు.నీరవ్ మోడీ వ్యవహరంలో నేహల్ దీపక్ హస్తం ఉందని కూడ ఆయన ఆరోపణలు ఉన్నాయి.

నీరవ్ మోడీ 2 బిలియన్ డాలర్ల వరకు బ్యాంకులను మోసం చేశారని నీరవ్ మోడీపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతను లండన్ జైల్లో మగ్గుతున్నాడు. ఈ నెల 19వ తేదీ వరకు నీరవ్ మోడీ రిమాండ్ కొనసాగనుంది.బెయిల్ కోసం నీరవ్ మోడీ లండన్ కోర్టులను ఆశ్రయించాడు. కానీ ఈ ఏడాది జూన్ మాసంలో నాలుగో దఫా నీరవ్ మోడీ బెయిల్ ను కోర్టు కొట్టివేసింది.