Asianet News TeluguAsianet News Telugu

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గృహనిర్బంధం..! సోషల్ మీడియాలో ఊహాగానాలు.. కొత్త అధ్యక్షుడి నియామకంపై వాదనలు

బీజేపీ నేత సుబ్రమణ్యస్వామియే కాకుండా పలువురు చైనా పౌరులు కూడా #XiJinping అనే హ్యాష్‌ట్యాగ్‌తో చైనా అధ్యక్షుడిని నిర్బంధించారని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారాన్ని తమ ఆధీనంలోకి తీసుకుందని చాలా మంది నెటిజ‌న్లు పేర్కొన్నారు.

Internet Abuzz With Rumours Of Xi Jinping's House Arrest, Coup In China
Author
First Published Sep 25, 2022, 6:20 AM IST

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గృహ నిర్బంధంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయనను బీజింగ్‌లో గృహనిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. దీంతో పాటు తిరుగుబాటుపై కూడా చర్చ జరుగుతోంది. అయితే, ప్రస్తుతానికి ఈ విషయాలన్నింటికీ అధికారిక ధృవీకరణ జరగలేదు. కానీ, జిన్ పింగ్ ను హౌస్ అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. అందుకు సంబంధించిన పలు పోస్టులు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎస్సీఓ సమ్మిట్ నుంచి చైనాకు వ‌చ్చిన తరువాత  చైనా సైన్యం.. అత‌డిని హౌస్ అరెస్టు చేసిన‌ట్టు ప‌లు పోస్టులు  సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. అంతే కాదు ఆర్మీ చీఫ్ పదవి నుంచి కూడా ఆయన్ను తప్పించారని పలువురు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా..  బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఈ విష‌యంపై స్పందిస్తూ.. ట్వీట్ చేయ‌డంతో ఆ ఊహాగానాల‌కు మ‌రింత ఊతమిచ్చిన‌ట్టు అయ్యింది. సోషల్ మీడియాలో వ్యాప్తి అవుతున్న‌ రూమర్‌పై విచారణ జరపాల్సిన అవసరం ఉందని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. బీజింగ్‌లో జీ జిన్‌పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారా? జి ఇటీవల సమర్‌కండ్‌లో ఉన్నప్పుడు.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయనను ఆర్మీ చీఫ్ పదవి నుండి తొలగించారని చెబుతారు. ఆపై గృహనిర్బంధంలో ఉంచారు. సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తున్నాయని, దీనిపై విచారణ జరపాలన్నారు. 

సుబ్రమణ్యస్వాయే కాకుండా  పలువురు చైనా పౌరులు కూడా #XiJinping అనే హ్యాష్‌ట్యాగ్‌తో చైనా అధ్యక్షుడిని నిర్బంధించారని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అలాగే..  ఓ వీడియోను కూడా వైర‌ల్ గా మారింది. ఇది మాత్రమే కాదు.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారాన్ని తమ ఆధీనంలోకి తీసుకుందని చాలా మంది నెటిజ‌న్లు కూడా పేర్కొన్నారు. అదే సమయంలో.. చైనాకు కాబోయే కొత్త అధ్యక్షుడు జనరల్ లీ కయోమింగ్ అంటూ వార్తలు వైరల్ గా  మారాయి. 

ఈ క్ర‌మంలో  #XiJinping అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు, చైనా, చైనా మిలిటరీకి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండ్‌గా కొనసాగాయి.

 అధికారిక నిర్ధారణ లేదు

అయితే... జిన్‌పింగ్‌ని నిజంగానే అరెస్టు చేశారనీ లేదా ఆర్మీ చీఫ్‌ పదవి నుంచి తొలగించారని ఏ అంతర్జాతీయ మీడియా కూడా ఈ వార్తను ధృవీకరించలేదు. ఇప్పటివరకు ఈ ఆంశంపై రాష్ట్ర మీడియా గ్లోబల్ టైమ్స్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నుండి అధికారిక ధృవీకరణ లేదు. కానీ, జీ జిన్‌పింగ్ నిర్బంధం, గృహనిర్బంధానికి సంబంధించి సోషల్ మీడియాలో వేల సంఖ్యలో ట్వీట్లు ఉన్నాయి.  
 
ఇటీవల ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఎస్‌సిఓ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్, ఇతర దేశాల నేతలు కూడా పాల్గొన్నారు. జిన్‌పింగ్ సమర్‌కండ్ నుండి తిరిగి వచ్చినప్పుడు, అతన్ని విమానాశ్రయం నుండి అదుపులోకి తీసుకున్నారని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత వారిని గృహనిర్బంధంలో ఉంచార‌ని పుకార్లు వెలువ‌డుతున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios