ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులపై ఆ దేశ పోలీసులు దారుణానికి ఒడిగట్టారు. దేశం విడిచి సరిహద్దులకు చేరుకున్న భారతీయ విద్యార్థులను దారుణంగా కొట్టారు. వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. 

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులపై ఆ దేశ పోలీసులు దారుణానికి ఒడిగట్టారు. దేశం విడిచి సరిహద్దులకు చేరుకున్న భారతీయ విద్యార్థులను దారుణంగా కొట్టారు. వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలాండ్ సరిహద్దుల్లో ఉక్రెయిన్ పోలీసులు క్రూరత్వానికి సంబంధించిన వీడియోను భారతీయ విద్యార్థులు షేర్ చేశారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సరిహద్దుల్లోకి చేరుకన్న విద్యార్థులపై ఉక్రెయిన్ పోలీసులు దారుణంగా వ్యవహరించారని తెలిపారు. కాళ్లతో తన్నారని.. గాల్లోకి కాల్పులు జరిపి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. 

‘పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. ఏం జరుగుతోందనేది తెలియడం లేదు. మమల్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. భారతీయ విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు.. మమ్మల్ని పోలాండ్‌కు వెళ్లనివ్వడం లేదు. మహిళా విద్యార్థులను సైతం వేధిస్తున్నారు.. జుట్టు పట్టుకుని లాగుతున్నారు. రాడ్‌లతో కొట్టారు. కొందరు మహిళా విద్యార్థులకు గాయాలయ్యాయి’ అని ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థిని మాన్సీ చౌదరి తెలిపారు. భారత రాయబార కార్యాలయ దౌత్యవేత్తలు మాకు ఆహారం మరియు ఆశ్రయం కోసం సహాయం చేస్తున్నారని మాన్సీ చెప్పారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా దాడిని భారతదేశం ఖండించనందున ఉక్రెయిన్ భద్రతా సిబ్బంది తమపై దాడి చేయడమే కాకుండా అనుచితంగా ప్రవర్తించారని ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దులో ఉన్న ఓ విద్యార్థి చెప్పారు. తాము చాలా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. 

ఇక, పోలాండ్‌లో ఇండియన్ ఎంబసీ ఇటీవల విడుదల చేసిన అడ్వైజరీలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయలును తరలింపు ప్రక్రియకు సూచనలు చేసింది. పశ్చిమ ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులను పోలాండ్ ద్వారా భారతదేశానికి తరలించాలని చూస్తున్నట్టుగా తెలిపింది. తరలింపు కోసం ఏర్పాటు చేయబడిన రాయబార కార్యాలయాల కో-ఆర్డినేట్‌లను గమనించాలని కోరింది. అందుకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా జత చేసింది.గూగుల్ ఫామ్‌లో వివరాలు రిజిస్టర్ చేయాలని పేర్కొంది. 

పోలాండ్ ప్రభుత్వం Shehyni-Medyka సరిహద్దు పాయింట్ ద్వారా కాలినడకన మాత్రమే జనాలు సరిహద్దు దాటడానికి అనుమతిస్తోంది. Krakowiec crossing వద్ద వారి వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులకు మాత్రమే అనుమతిస్తోంది. ఇక, ఇప్పటికే కొందరు భారతీయులు పోలాండ్‌ సరిహద్దులకు చేరుకన్న సంగతి తెలిసిందే. అయితే భారతీయుల తరలింపు ప్రక్రియకు సంబంధించి పోలాండ్ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులందరినీ ఎలాంటి వీసా లేకుండానే పోలాండ్‌లోకి అనుమతించనున్నట్టుగా భారత్‌లోని ఆ దేశ రాయబారి Adam Burakowski తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.