Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్గనిస్తాన్‌లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. అలర్ట్ అయిన కేంద్రం, భారతీయుల కోసం స్పెషల్ ఫ్లైట్

ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. తాలిబాన్లకు , ఆ దేశ బలగాలకు  మధ్య జరుగుతున్న హింసాత్మక పోరులో సాధారణ పౌరులు బలవుతున్నారు. దీంతో భారతీయుల కోసం ప్రత్యేక విమానాన్ని అందుబాటులో వుంచింది కేంద్రం

India to evacuate officials and nationals from Mazar e Sharif in northern Afghanistan ksp
Author
Mazar-e Sharif, First Published Aug 10, 2021, 6:03 PM IST

ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. తాలిబాన్లకు , ఆ దేశ బలగాలకు  మధ్య జరుగుతున్న హింసాత్మక పోరులో సాధారణ పౌరులు బలవుతున్నారు. తాజాగా ఆఫ్గన్‌లోని నాలుగో అతిపెద్ద  నగరం మజార్ ఈ షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తాలిబన్లు ప్రకటించడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యింది. ఆఫ్గన్‌లోని భారతీయులు ప్రత్యేక విమానంలో మజార్ ఈ షరీఫ్‌ నగరం నుంచి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా సూచించింది.

వారి కోసం ప్రత్యేక విమానాన్ని అందుబాటులో వుంచింది కేంద్రం. మజార్ ఈ షరీఫ్‌లోని మెజారిటీ ప్రాంతాన్ని తాలిబన్లు ఇప్పటికే ఆక్రమించుకున్నారు. గత మే నెల నుంచి ఆఫ్గన్‌లోని అమెరికా బలగాలు కూడా వెనక్కి వచ్చేస్తున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దేశంలోని పలు జిల్లాలు తాలిబన్ల చేతిలోకి వెళ్తుండటంతో అక్కడి ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే తాలిబన్ల వశం అవుతుందని.. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios