పాలస్తీనా శరణార్థుల కోసం యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ కి భారతదేశం 2018నుండి ఇప్పటి వరకూ 22.5 మిలియన్ డాలర్ల విరాళం అందించింది. యూఎన్ఆర్ డబ్యూఏ అనేది యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ, ఇది పాలస్తీనియన్ శరణార్థులకు ఉపశమనం అందిస్తుంది.  వారి మానవ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. 

 భారత్ మరోసారి తన దాత్రుత్వాన్ని చాటుకుంది. పాలస్తీనా శరణార్థుల సహాయార్థం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీకి $ 2.5 మిలియన్ డాలర్ల చెక్కును అందించింది. పాలస్తీనా శరణార్థులకు మద్దతుగా సంవత్సరానికి మన దేశం $5 మిలియన్ డాలర్లను అందిస్తుంది. నేడు రెండవ విడత చెక్కును అందించింది. ఈ డబ్బును శరణార్థుల కోసం పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు మరియు ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఉపయోగిస్తారు.

భారతదేశం 2018 నుండి UNRWA (నియర్ ఈస్ట్ పాలస్తీనా శరణార్థుల కోసం యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ)కి USD 22.5 మిలియన్లను అందించింది. UNRWA అనేది యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ, ఇది పాలస్తీనియన్ శరణార్థులకు సహాయం అందిస్తుంది. వారి మానవ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.

పాలస్తీనా శరణార్థులకు మద్దతుగా UNRWAకి భారతదేశం (రెండవ విడత) 2.5 మిలియన్లను అందించిందని రమల్లాలోని భారత ప్రతినిధి కార్యాలయం (ROI) తెలిపింది. జూన్ 23, 2020న జరిగిన మినిస్టీరియల్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్, రాబోయే రెండేళ్లలో యూఎన్ఆర్ డబ్యూఏకి భారతదేశం పది మిలియన్ US డాలర్లను అందించనున్నట్లు ప్రకటించారు.

నమోదిత పాలస్తీనియన్ శరణార్థుల సంఖ్య మరియు వారి పేదరికం కారణంగా UNRWA సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను ఎదుర్కొంటోంది. ఈ ఏజెన్సీని 1949లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్థాపించింది. ఇది UNRWAతో నమోదు చేసుకున్న మొత్తం 5.6 మిలియన్ల శరణార్థులకు సహాయం, రక్షణను అందిస్తుంది. జెరూసలేం , గాజా స్ట్రిప్‌తో సహా జోర్డాన్, లెబనాన్, సిరియా, వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా శరణార్థులకు వారి పూర్తి మానవ అభివృద్ధి సామర్థ్యాన్ని సాధించడానికి సహాయం చేయడం UN ఏజెన్సీ లక్ష్యం.