Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్తాన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ హైకమీషనర్ గౌరవ్ అహ్లువాలియా జాతీయ జెండాను ఎగురవేసి.. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సందేశాన్ని చదివి వినిపించారు

Independence Day celebrations in Indian High Commission in Pakistan
Author
Islamabad, First Published Aug 15, 2019, 6:55 PM IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్తాన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ హైకమీషనర్ గౌరవ్ అహ్లువాలియా జాతీయ జెండాను ఎగురవేసి.. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సందేశాన్ని చదివి వినిపించారు.

అంతకుముందు హైకమీషన్ కుటుంబసభ్యులు 73 కిలోమీటర్లు సైక్లింగ్ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా హైకమీషన్‌లో పనిచేసే ఉద్యోగుల కుటుంబసభ్యులు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు.

మరోవైపు జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ క్రమంలో భారత్‌తో దైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించింది.

ఇస్లామాబాద్‌లోని భారత హైకమీషనర్‌ను బహిష్కరించగా.. న్యూఢిల్లీలో బాధ్యలు చేపట్టనున్న పాక్ రాయబారిని స్వదేశంలోనే నిలిపివేసింది. అంతేకాకుండా భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని బ్లాక్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios