ఓ తండ్రి నిర్లక్ష్యం వల్ల పది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోర్చుగల్‌లో ఓ తండ్రి తన 10 నెలల పసికందును పొరపాటున ఏడు గంటల పాటు కారులో వదిలివేయడంతో మరణించింది.
ఓ తండ్రి నిర్లక్ష్యం వల్ల 10 నెలల పసికందు బలి అయ్యింది. ఆ తండ్రి హేమరపాటు.. వారి ఇంట్లో విషాదాన్ని నింపాయి. పది నెలల పసి బిడ్డను ఓ తండ్రి కారులో వదిలేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు గంటల పాటు ఆ చిన్నారి కారులోనే ఉండిపోయింది. ఓ వైపు ఊపిరాడక.. లోపల వేడికి ఆ చిన్నారి అల్లాడిపోయింది. చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ చిన్నారి తల్లి కన్నపేగు అల్లాడిపోయింది. ఈ విషాద సంఘటన పోర్చుగల్‌లో చోటుచేసుకుంది.
లెక్చరర్ అయిన ఒక వ్యక్తి మంగళవారం నాడు తన పది నెలల పసి బిడ్డతో సహా కారులో ప్రయాణించాడు. అయితే.. మార్గమధ్యలో ఆ చిన్నారిని నర్సరీ వద్ద అప్పగించాలి. కానీ.. ఆ తండ్రి మరిచిపోయాడు. తాను లెక్చరర్ గా పనిచేస్తున్న నోవా యూనివర్శిటీ క్యాంపస్‌కు చేరుకున్నాడు. కారులో తన బిడ్డ ఉన్న విషయం పూర్తిగా మారిపోయాడు. రోజులాగానే.. కారును పార్క్ చేసి డోర్లు లాక్ చేశాడు. తన కార్యాలయానికి వెళ్లిన అతడు..విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో బిజీ అయ్యాడు.
అతడు దాదాపు ఏడు గంటల తర్వాత తిరిగి తన కారు వద్దకు చేరుకున్నాడు. కారు డోర్ తెరిచి చూడగా వెనుక సీటులో తన పది నెలల కుమార్తె అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. అక్కడకు చేరుకున్న వైద్య సిబ్బంది ఆ పసికందును పరీక్షించి.. ఆ చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ చిన్నారి తల్లి ఘటనాస్థలికి చేరుకుని షాక్ గురైంది.
బిడ్డ చనిపోవడాన్ని చూసి బాధతో సొమ్మసిల్లి పడిపోయింది. అయితే.. పసికందు నిద్రిస్తోందని, ఆమె తండ్రి ఆమె కారులో ఉన్న విషయాన్ని మర్చిపోయారని అధికారులు పేర్కొన్నారు. సమాచారం ప్రకారం.. శవపరీక్ష ఫలితాలు ఇంకా వెలువడలేదు. సంఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత దాదాపు 26 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. అంటే లాక్ చేయబడిన కారు లోపల ఉష్ణోగ్రత రెట్టింపు అయి ఉంటుంది. దీంతో ఆ చిన్నారి వేడి తట్టుకోలేక చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
