బిల్ గేట్స్ ఆయన భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ 2021 మేలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు విడి విడిగానే ఉంటున్నారు. అయితే ఇటీవల బిల్ గేట్స్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన మాజీ భార్యను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని తెలిపారు.
మైక్రోసాఫ్ట్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ బిలియనీర్ బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ గురించి మాట్లాడారు. ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ వివాహం చాలా అద్భుతంగా జరిగిందని చెప్పారు. వారి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను బిల్ గేట్స్ ‘సండే టైమ్స్’తో పంచుకున్నారు.
ఆ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెలిండాను తాను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గత రెండు సంవత్సరాలను చాలా నాటకీయంగా అభివర్ణించారు. COVID-19 మహమ్మారి, విడాకులుచ పిల్లలను విడిచిపెట్టడం జీవితంలో విచిత్రమైన పరిస్థితిని తెలిపారు. పిల్లలు పెద్దయ్యాక, ఇల్లు విడిచిపెట్టిన తర్వాత ప్రతీ పెళ్లి పరివర్తన చెందుతుందని ఆయన అన్నారు. బిల్ గేట్స్ ఉద్దేశంలో పరివర్తన ‘‘విడాకులు’’ అని అర్థం.
బిల్ గేట్స్, మెలిండా గేట్స్ 1994 లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు (జెన్నర్, రోరీ మరియు ఫోబ్) ఉన్నారు. దాదాపు 27 సంవత్సరాల వైవాహిక జీవితం తరువత వారు 2021 మేలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే వీరి విడాకులు 2021 ఆగస్టులో అధికారికంగా ఖరారు అయ్యాయి. అయితే వీరు నిర్వహిస్తున్న బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను కలిసి కొనసాగిస్తామని ప్రకటించారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బిల్ గేట్స్ తన మాజీ భార్యతో ప్రస్తుతం ఉన్న పని సంబంధాలను కూడా వివరించారు. వైవాహిక జీవితం ముగియడంపై ఆయనకు ఎలా అనిపించిందో చెప్పాడు. అయినప్పటికీ ఆయన తన వివాహాన్ని గొప్పగా వివరించాడు. కానీ ఇప్పుడు దానిని తాను మార్చలేనని చెప్పారు. ‘‘ మీకు తెలుసా.. నేను మరెవరినీ పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను ’’ అని అన్నారు. మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌ని మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు దానికి ఆయన అవును అని సమాధానం ఇచ్చారు. ‘‘ అవును. నేను మెలిండాను మళ్ళీ వివాహం చేసుకుంటానని చెబుతున్నాను. అదే విషయం చెబుతున్నాను. ప్రస్తుతం నా భవిష్యత్తు గురించి, నా దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవు. కానీ నేను పెళ్లికి చాలా సిఫార్సు చేస్తున్నాను ’’ అని బిల్ గేట్స్ చెప్పారు.
తన భార్య విడాకలు వైపు వెళ్తోందని తనకు తెలియదని బిల్ గేట్స్ అన్నారు. ఇప్పటికీ తన మాజీ భార్యతో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. బిల్ గేట్స్ తన మాజీ భార్యతో ఇప్పటికీ స్నేహంగానే ఉన్నానని తెలిపారు. అందుకే ఇద్దరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ‘‘ మేము మా ఫౌండేషన్‌లో వార్షిక ఉద్యోగుల సమావేశం, గివింగ్ ప్లెడ్జ్ కార్యక్రమాన్ని జూన్ లో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాన్ని మేము ఇద్దరం కలిసి చేపడుతాం. ఆమెతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు తెలుసా.. మేము ఇద్దరం కలిసి ఫౌండేషన్ ను నిర్మించాం’’ అని బిల్ గేట్స్ తెలిపారు.
