అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  ఇండియా ప్రధాని  నరేంద్ర మోడీని   ఆటోగ్రాఫ్ అడిగారు.  జీ7 సమ్మిట్ లో  ఈ ఘటన చోటు  చేసుకుంది.


 హిరోషిమా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని మోడీని ఆటోగ్రాఫ్ అడిగారు. జపాన్ లోని హిరోషిమాలో జీ7 సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడే నాయకుల్లో మోడీ ఒకరని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వ్యాఖ్యలు చేశారు.ఈ ఏడాది ఆరంభంలో ఇటలీ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 

జీ7 సమ్మిట్ సమావేశంలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ లు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
 క్వాడ్ దేశాధినేతల సమావేశం జరిగింది. అస్ట్రేలియా, అమెరికా, భారత్, జపాన్, అస్ట్రేలియా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

వచ్చే నెలలో నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన గురించి బైడెన్ , మోడీ మధ్య ప్రస్తావన వచ్చింది. మోడీ కార్యక్రమానాకి హాజరు కావాలని ప్రముఖుల నుండి అభ్యర్ధులు వస్తున్న విషయాన్ని బైడెన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమానికి సంబంధించి తమపై ఒత్తిడి ఉందని బైడెన్ తెలిపారు. 

మరో వైపు అస్ట్రేలియా ప్రధాని ఆంధోని అల్బనీస్ స్పందించారు. సిడ్నీలో కమ్యూనిటీ రిసెప్షన్ కోసం 20 వేల మంది ఉందన్నారు. అయితే అతను ఇప్పటికీ తనకు వస్తున్న అభ్యర్ధులకు అనుగుణంగా లేదన్నారు. 

ఈ విషయాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ , అస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మోడీ వద్ద ప్రస్తావించారు. విజయోత్సవ ల్యాప్ లో నరేంద్ర మోడీకి 90 వేల మందికి పైగా ప్రజలు స్వాగతం పలికిన విషయాన్ని అస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జోక్యం చేసుకున్నారు. నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.జపాన్ లోని హిరోషిమాలో జీ7 సదస్సు జరిగింది. ప్రపంచంలోని జీ7 దేశాలకు చెందిన 22 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.