Imran Khan: తాను భారత వ్యతిరేకిని లేదా అమెరికా వ్యతిరేకి కాదని, తాను ఏ ఇతర దేశాలకు వ్యతిరేకం కాదని, పరస్పర గౌరవం ఆధారంగా అన్ని దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
Imran Khan: పాకిస్తాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగతోంది. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఆ దేశ మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరును ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు. పొలిటికల్ పరిస్థితుల దృష్ట్యా జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలపై దాడి చేశారు.
జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఎన్నికలకు సిద్ధం కాకుండా సుప్రీంకోర్టు వైపు చూడాలనే ఉమ్మడి ప్రతిపక్షం వ్యూహానికి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. తన దేశంపై విదేశీలు కన్నువేశారని, తాత్కాలిక ప్రధానమంత్రిని నియమించే వరకు ప్రధానిగా కొనసాగాలని అధ్యక్షుడు కోరారు. ఈ క్రమంలో తాను విదేశాలకు వ్యతిరేకం కాదని అన్నారు. తాను ఏ దేశానికీ వ్యతిరేకిని కాదనీ, భారతీయ లేదా అమెరికన్ వ్యతిరేకిని కాదనీ, కానీ వారి దేశ విధానాలకు వ్యతిరేకం కావచ్చని తెలిపారు. తనకు ఇతర దేశాల స్నేహం కావాలని తెలిపారు.
తనకు అమెరికా పట్ల దురుద్దేశం లేదని, అయితే ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అగ్రరాజ్యంతో పరస్పర స్నేహాన్ని లక్ష్యంగా చేసుకున్నానని ఖాన్ చెప్పినట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.
ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ద్వారా తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి "విదేశీ కుట్ర"లో పాల్గొన్న వ్యక్తిగా US సీనియర్ దౌత్యవేత్త డొనాల్డ్ లూను పేర్కొన్న ఒక రోజు తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే.. భారతదేశ విధానాలను వ్యతిరేకించే.. ఆయన ఇటీవలి కాలంలో భారత్ విదేశాంగ విధానాన్ని ప్రశంసించడం గమనార్హం.
అలాగే.. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. అప్పుల కారణంగా ఏ దేశానికి బానిసగా మారవద్దని, ఆ విషయానికి తన దేశానికి చెప్పాలనుకుంటున్నట్లు అన్నారు. అలాంటి సందర్భం వస్తే.. బానిసత్వం కంటే మరణం ఉత్తమమని, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా నేతృత్వంలోని యుద్ధాన్ని తాను వ్యతిరేకించానని, అయితే తాను ఎప్పుడూ అమెరికాకు వ్యతిరేకం కాలేదని ఖాన్ అన్నారు.
పరస్పర గౌరవం ఆధారంగా అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నానని, పాకిస్థాన్ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన ఎలాంటి విధానాలను తాను అంగీకరించబోనని అన్నారు. అలాంటి సందర్భం వస్తే.. దాస్యం కంటే మరణం ఉత్తమమని అన్నారు. 220 మిలియన్ల జనాభా ఉన్న పాలకుడు చేతిలో కాగితం పట్టుకుని శక్తివంతమైన దేశ అధ్యక్షుడితో చర్చలు జరపడం యావత్ దేశానికే అవమానమని ప్రధాని అన్నారు.
