టెక్సాస్ లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇది 4వ అతిపెద్ద భూకంపంగా నిలిచింది. ఈ విషయాన్ని నేషనల్ వెదర్ సర్వీస్ మిడ్లాండ్ కార్యాలయం ట్వీట్ లో పేర్కొంది.

పశ్చిమ టెక్సాస్ లోని చమురు ఉత్పత్తి చేసే ప్రాంతంలో శుక్రవారం 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:35 గంటలకు మిడ్లాండ్ కు వాయువ్య దిశగా 22 కిలోమీటర్ల దూరంలో ఎనిమిది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ తహిల్ రమణికి సీబీఐ క్లీన్ చీట్ - లోక్ సభలో వెల్లడించిన కేంద్రం

భూకంపం సంభవించిన మూడు నిమిషాల తర్వాత 3.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది. టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇది 4వ అతిపెద్ద భూకంపం అని నేషనల్ వెదర్ సర్వీస్ మిడ్లాండ్ కార్యాలయం ట్వీట్ చేసింది. టెక్సాస్ పాన్హాండిల్ సమీపంలోని లుబాక్ నుండి మిడ్లాండ్ కు నైరుతి దిశలో 20 మైళ్ల దూరంలో ఉన్న ఒడెస్సా వరకు పెద్ద ప్రాంతంలో భూకంపం సంభవించిందని లుబాక్లోని టెలివిజన్ స్టేషన్ కేఎల్బీకే వాతావరణ శాస్త్రవేత్త జాకబ్ రిలే ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

న్యూ మెక్సికో సరిహద్దుకు దక్షిణంగా ఉన్న పశ్చిమ టెక్సాస్ లోని పెకోస్ ప్రాంతంలో మరో భూకంపం సంభవించిన సరిగ్గా నెల రోజుల తర్వాత శుక్రవారం ఈ భూకంపం వచ్చింది. దీనివల్ల ఎలాంటి నష్టమూ జరగలేదు.