ఇండోనేషియాలోని అచె ప్రావిన్స్ లో భారీ భూకంపం..
Indonesia earthquake : ఇప్పటికే పలు భూకంపాలతో అతలాకుతలమైన ఇండోనేషియాలో మళ్లీ భూకంపం సంభవించింది. అచే ప్రావిన్స్ (Aceh province)లో శనివారం సంభవించిన ఈ భూపంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9గా నమోదు అయ్యింది.
ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్ లో శనివారం భారీ భూకంపం వచ్చింది. ఈ బలమైన, నిస్సారమైన భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9గా నమోదు అయ్యింది. అయితే ఈ ప్రకంపనల వల్ల ప్రాణ, ఆస్థి నష్టం సంభవించిందా లేదా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అచే ప్రావిన్స్ లోని తీరప్రాంత పట్టణమైన సినాబాంగ్ కు తూర్పున 362 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
రైతు భరోసా, పెన్షన్ లపై అపోహలొద్దు.. కొత్త వారే దరఖాస్తు చేసుకోవాలి - సీఎం రేవంత్ రెడ్డి
అయితే ఈ భూ భూకంపం వల్ల సునామీ ప్రమాదమేమీ పొంచి లేదని, కానీ మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ఇండోనేషియా వాతావరణ, జియోఫిజికల్ ఏజెన్సీ హెచ్చరించింది. 270 మిలియన్లకు పైగా జనాభా కలిగిన విస్తారమైన ద్వీపసమూహమైన ఇండోనేషియా, పసిఫిక్ బేసిన్ లోని అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్ల ఆర్క్ అయిన ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’లో ఉంది. అందుకే ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు సంభవిస్తాయి.
గతేడాది నవంబర్ 21వ తేదీన పశ్చిమ జావాలోని సియాంజూర్ నగరంలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 331 మంది మృతి చెందగా, దాదాపు 600 మంది గాయపడ్డారు. 2018లో కూడా ఇదే దేశంలో భూకంపం, సునామీ సంభవించడంతో 4,340 మంది ప్రాణాలు కోల్పోయారు.