Asianet News TeluguAsianet News Telugu

చిన్నారి అంత్యక్రియలు: గల్ఫ్ లో చిక్కుకున్న కేరళ దంపతులకు అస్సాం డాక్టర్ సహాయం

కరోనా కష్టకాలంలో సహాయం కోసం అర్థిస్తున్న వారికి ముక్కు మొఖం తెలియనివారు సైతం ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. ఇలా ముక్కు మొఖం తెలియని ఒక వ్యక్తి వేల మైళ్ళ దూరంలో కొడుకు చనిపోయి... భారతదేశం తీసుకురావడానికి ప్రయత్నం చేయబట్టి 12 రోజులవుతున్నా,  అది కుదరక, ఎటూ పాలుపోని స్థితిలో నిస్సహాయంగా ఉండిపోయిన ఆ తల్లిదండ్రులకు సహాయం చేసాడు. తమ కన్నా కొడుకు అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించాలన్న కన్న పేగు కోరికనుకి తీర్చాడు. 

How Assam Doctor Helped Kerala Couple Fly 4-Year-Old Son's Dead Body From UAE
Author
Hyderabad, First Published May 18, 2020, 4:02 PM IST

కరోనా కష్టకాలంలో సహాయం కోసం అర్థిస్తున్న వారికి ముక్కు మొఖం తెలియనివారు సైతం ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. ఇలా ముక్కు మొఖం తెలియని ఒక వ్యక్తి వేల మైళ్ళ దూరంలో కొడుకు చనిపోయి... భారతదేశం తీసుకురావడానికి ప్రయత్నం చేయబట్టి 12 రోజులవుతున్నా,  అది కుదరక, ఎటూ పాలుపోని స్థితిలో నిస్సహాయంగా ఉండిపోయిన ఆ తల్లిదండ్రులకు సహాయం చేసాడు. తమ కన్నా కొడుకు అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించాలన్న కన్న పేగు కోరికనుకి తీర్చాడు. 

వివరాల్లోకి వెళితే... కృష్ణదాస్, దివ్య దంపతులకు నాలుగు సంవత్సరాల వైష్ణవ్ అనే కొడుకు ఉన్నాడు. కేరళకు చెందిన వీరు ఉపాధి కోసమని గల్ఫ్ లో ఉంటున్నారు. మే 8వ తేదీనాడు లుకేమియా తో బాధపడుతూ 4 సంవత్సరాల కుమారుడు మరణించాడు. 

ఆ తల్లిదండ్రులు వారి కుమారుడికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు. ఆ రోజు నుండి ఆ చిన్నారి శవాన్ని భారతదేశానికి తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అక్కడ భారతీయ ఎంబసి అధికారులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసారు. అయినా ఫలితం శూన్యం.  

ఒక మూడు ఎమర్జెన్సీ విమానాలు భారత్ వెళ్లినప్పటికీ... వాటిలో తమ కుమారుడి శవాన్ని ఇండియాకు తీసుకురావడానికి వారికి అవకాశం దక్కలేదు. అలా వారు సహాయం కోసం 10 రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. 

ఇలా వారి బాధను అక్కడి ఒక మీడియా సంస్థ ప్రసారం చేసింది. దాన్ని అస్సాం కు చెందిన ఒక డాక్టర్, సామాజిక కార్యకర్త అయినా భాస్కర్ గొగోయ్ చూసాడు. వెంటనే ఆ సదరు రిపోర్టర్ ద్వారా వీరికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాడు. అలా సేకరించిన వివరాలను వెంటనే విదేశాంగ మంత్రి జయశంకర్ దృష్టికి తీసుకెళ్లాడు. జయశంకర్ కూడా వెంటనే స్పందించి వారిని వెనక్కి తీసుకొచ్చేనందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసాడు. 

ఆ కుటుంబ సభ్యుల పూర్తి టికెట్ రేటును ప్రభుత్వమే భరించి భారత్ కు తీసుకొచ్చారు. శాస్త్ర ప్రకారంగా తమ కుమారుడిని ఖననం చేయగలిగినందుకు సంతోషపడాలో, తమ కొడుకు కళ్ళ ముందే మరణిస్తున్నా కూడా ఏమీ చేయలేకపోయినందుకు బాధపడాలో అర్థం కానీ పరిస్థితి ఆ తల్లిదండ్రులది. 

Follow Us:
Download App:
  • android
  • ios