శాస్త్ర, సాంకేతికతను మనిషి మంచి పనులకు ఉపయోగిస్తే దాని వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చునని గతంలో ఎన్నో సార్లు రుజువైంది. తాజాగా అమెరికాలో ఓ పశువైద్యుడు టెక్నాలజీ సాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసించే డా. రే ఎమర్సన్ కొంతకాలంగా యాపిల్ స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు గుండె కొట్టుకోవడంలో తేడాలు రావడంతో అనారోగ్యానికి గురయ్యారు.

Also Read:రేపే మహారాష్ట్రలో బలపరీక్ష: అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ ఆదేశం

తొలుత ఈ విషయాన్ని ఆయన పసిగట్టలేకపోయారు. ఎమర్సన్ పెట్టుకున్న యాపిల్ స్మార్ట్‌వాచ్ ఆయన హృదయ స్పందనలు సరిగా లేవని నోటిఫికేషన్స్ చూపించింది. ఇది చూసిన ఆయన వెంటనే అప్రమత్తమై దగ్గరలోని సెయింట్ డేవిడ్ వైద్య కేంద్రానికి వెళ్లాడు.

అతనిని పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో కోలుకున్న అనంతరం ఎమర్సన్ మీడియాతో మాట్లాడుతూ.. తాను యాపిల్ వాచ్‌ను చాలా తక్కువ ధరకు కొన్నానని... కానీ ఇప్పుడు అది తన దృష్టిలో వెలకట్టలేనిదని తెలిపాడు. కాగా ఈ వాచ్ సాయంతో ఇప్పటికే అమెరికాలో చాలా మంది హృదయ సంబంధిత సమస్యలు తెలుసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 

Also Read:అజిత్ పవార్ ఘర్ వాపసీ కి అసలు కారణం ఇదే ...