నల్ల జాతీయుడు అయిన జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికా వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా పెద్దన్న తీరుపై విమర్శలు పెల్లుబుకుతున్నాయి.ఇప్పటివరకూ నిరసనలకి తెర దించేలా ట్రంప్ బాధ్యతాయుతంగా ప్రవర్తించక పోవడం ఎంతో బాధాకరమైన విషయమని అందరూ విమర్శిస్తున్నారు.

ఇన్ని గొడవలు జరుగుతుంటే ఉగ్ర దాడి జరిగినట్టుగా ట్రంప్ బంకర్ లో తలదాచుకోవడం పై విమర్శిస్తున్నారు.కేవలం ట్రంప్ నిరసన కారులు చేస్తున్న ఆందోళనలపైనే మాట్లాడుతున్నారు కానీ పోలీసు అధికారి గురించి అన్యాయమై పోయిన ఫ్లాయిడ్ కుటుంభం గురించి మాట్లాడక పోవడం బాధ్యతా రాహిత్యమేనంటూ మండిపడ్డారు.

కాగా..  గత వారం రోజులగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కాస్త అవి తగ్గాయనే చెప్పాలి. కాగా.. ఇలాంటి సమయంలో ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జార్జ్ ఫ్లాయిడ్ మృతి పై తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపేలా ఉన్నాయి.

గత వారం మన దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు.. మళ్లీ ఇలాంటి సంఘటన జరగనివ్వను అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చనిపోయిన జార్జ్ మనసులోని భావాలు ఇలా ఉన్నాయంటూ ట్రంప్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.

జార్జ్..పై నుంచి ఇక్కడ జరిగేదంతా చూస్తూనే ఉంటాడని అనుకుంటున్నాను. మన దేశానికి జరిగిన గొప్ప విషయమిది అని జార్జ్ చెబుతున్నాడు అంటూ ట్రంప్ పేర్కొన్నారు.

కాగా.. జార్జ్ చనిపోయిన దాదాపు 11 రోజుల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాకుండా.. ఈ రోజు జార్జ్ ఫ్లాయిడ్ కి గొప్ప దినమంటూ పేర్కొనడం విశేషం. సమానత్వానికి ఇదో గొప్ప రోజు అంటూ ట్రంప్ తెలిపారు.

కాగా.. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. మే 25న డెరెక్ చావిన్ అనే పోలీసు అధికారి కారణంగా ఊపరి ఆడక మరణించాడు. ఇదే సమయంలో అక్కడే మరో ముగ్గురు పోలీసు అధికారులు ఉన్నారు. మెడపై ఊపిరాడనివ్వకంగా.. చేయడంతో జార్జ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువయ్యాయి.

జార్జ్ ఫ్లాయిడ్ కేసులో నలుగురు పోలీసులకు శిక్ష పడాలని అతని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. నిరసనకారులు సైతం నలుగురు పోలీసు అధికారులకు శిక్ష పడాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హత్య సమయంలో చావిన్‌కు మిగిలిన ముగ్గురు అధికారులు సహాయ పడినట్టు కోర్టు తేల్చింది. ఎట్టకేలకు మిగిలిన ముగ్గురు పోలీసు అధికారులు కూడా దోషులేనంటూ మిన్నెసొటా అటార్ని జనరల్ కీత్ ఎల్లిసన్ బుధవారం తీర్పిచ్చారు. న్యాయ మార్గంలో ఈ తీర్పు మరో ముందడుగు అని జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబ తరపు న్యాయవాది బెంజామిన్ కూప్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. చావిన్‌పై నమోదైన థర్డ్ డిగ్రీ మర్డర్‌ కేసును సెకండ్ డిగ్రీ మర్డర్‌ కింద మార్చుతూ కోర్టు తీర్పునిచ్చింది. థర్డ్ డిగ్రీ మర్డర్‌తో పోల్చితే సెకండ్ డిగ్రీ మర్డర్‌ కింద జైలుశిక్ష 15 ఏళ్లు ఎక్కువగా పడుతుంది. దీంతో చావిన్‌కు దాదాపు నలభై ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు కనపడుతున్నాయి