కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు హాంకాంగ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా బార్లు, నైట్ క్లబ్ లు, కారావ్‌కో పార్లర్లను నేటి నుంచి తిరిగి తెరవనుంది. అలాగే, అర్ధరాత్రి దాటే వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది.

వ్యాక్సిన్ వేయించుకునేందుకు మరింత మంది ముందుకు రావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు కనీసం ఒక్క డోసు వ్యాక్సినైనా వేయించుకుంటేనే బార్లు, నైట్ క్లబ్ పార్లర్లలోకి అనుమతిస్తారు.

అలాగే, ఆయా క్లబ్ లు, బార్లు, పార్లర్ల సిబ్బంది కూడా వ్యాక్సిన్ వేయించుకుంటేనే తెరిచేందుకు అనుమతిస్తారు. ఈ మేరకు ఫుడ్ అండ్ హెల్త్ సెక్రటరీ సోఫియా చాన్ తెలిపారు.

 తాజా నిబంధనల ప్రకారం బార్లు, నైట్ క్లబ్బు లను అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల వరకు అనుమతిస్తారు. అయితే ఒక్కో టేబుల్ కి ఇద్దరేసి మించకూడదు. ఇక, కరావోకో రూమ్స్‌లోకి నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. జనాభాలో 11 శాతం మంది కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.

రెస్టారెంట్లను కూడా టేబుల్ పరిమితితో అనుమతిస్తామని చాన్  తెలిపారు. సిబ్బంది మొత్తం వ్యాక్సినేషన్ వేసుకుంటే ఈటరీలను  అనుమతి ఇస్తామన్నారు. అటువంటి ఈటరీలను ఒక్కో టేబుల్‌కు ఆరుగురు చొప్పున అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వ్ చేసుకునేందుకు అనుమతి ఇస్తామని అన్నారు. అయితే ఆయా సంస్థలు తొలుత ‘లీవ్‌హోంసేఫ్’ యాప్‌లో తొలుత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని చాన్ వివరించారు.