Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రెండురోజులకు.. నర్సు మృతి..

ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజుల తర్వాత పోర్చుగీసులో ఓ నర్స్‌ చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ఈ ఘటన ఇప్పుడు వ్యాక్సిన్‌ పనితీరు పట్ల మరిన్ని అనుమానాలను, భయాలను పెంచుతోంది. 

Health Worker Dies Two Days After Receiving Pfizer s Covid-19 Vaccine - bsb
Author
Hyderabad, First Published Jan 5, 2021, 4:27 PM IST

ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజుల తర్వాత పోర్చుగీసులో ఓ నర్స్‌ చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ఈ ఘటన ఇప్పుడు వ్యాక్సిన్‌ పనితీరు పట్ల మరిన్ని అనుమానాలను, భయాలను పెంచుతోంది. 

వివరాల్లోకి వెడితే... సోనియా అసేవెడో(41) అనే మహిళ పోర్టోలోని పోర్చుగీసు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీలో పిడియాట్రిక్‌ అసిస్టెంట్‌ నర్స్‌గా పని చేస్తున్నారు. ఫైజర్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగంలో భాగంగా సోనియా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మృత్యువాత పడ్డారు. 

దీనిమీద సోనియా తండ్రి అబిలియో అసేవెడో మాట్లాడుతూ.. ‘నా కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. రెండు రోజుల క్రితం తను కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకుంది. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇక వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కానీ వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా తను మరణించింది. నా కుమార్తె ఎందువల్ల మరణించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. 

అంతేకాక సోనియాకు మద్యం అలవాటు లేదని.. ఈ మధ్య కాలంలో ఎలాంటి కొత్త ఆహార పదార్థాలను తీసుకోలేదని.. అంతా సాధారణంగానే ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఇక పోర్చుగీసు ఆరోగ్య శాఖ అధికారులు సోనియా మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోర్చుగీసులో 538 ఆరోగ్య కార్యకర్తలు ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. పది మిలియన్ల జనాభా గల పోర్చుగీసులో 4,27,000 కరోనా కేసులు నమోదు కాగా.. 7,118 మంది మరణించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios