కొత్త సంవత్సరంలోకి ఘనంగా అడుగుపెట్టిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.. ఆకట్టుకున్న ఫైర్ వర్క్స్

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వాసులు ప్రపంచంలో అందరికంటే ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. భారీ ఎత్తున బాణాసంచా పేల్చి విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ , ఫైర్ వర్క్స్‌ షో అందరినీ ఆకట్టుకుంది.

Happy New Year: Australia, New Zealand welcome 2024 ksp

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వాసులు ప్రపంచంలో అందరికంటే ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. భారీ ఎత్తున బాణాసంచా పేల్చి విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ , ఫైర్ వర్క్స్‌ షో అందరినీ ఆకట్టుకుంది. ఆక్లాండ్‌లోని స్కై సిటీలో ఈ వేడుకలు జరిగాయి. అక్కడి స్కై టవర్‌పై పది సెకన్ల కౌంట్‌ డౌన్ మొదలుపెట్టి జీరో రాగానే క్రాకర్స్ కాల్చి చాలా గ్రాండ్‌‌గా న్యూఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. దాదాపు 5 నిమిషాల పాటు కాల్చిన క్రాకర్స్ కలర్‌ఫుల్‌గా సాగాయి. 

ఇకపోతే.. ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా ముందే పసిఫిక్ ద్వీప దేశం కిరిబాతి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. న్యూజిలాండ్ కంటే ముందే అక్కడ వేడుకలు మొదలయ్యాయి. దీనిని క్రిస్మస్ ఐస్‌లాండ్ గానూ పిలుస్తారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆశలు చిగురించేలా లేజర్ షోలు ఏర్పాటు చేశారు. ఇక సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద ఫైర్ వర్క్స్ ఆకట్టుకున్నాయి.

 

 

భారత్ కన్నా ఐదున్నర గంటల ముందు ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సర వేడుకలు మొదలవుతాయి. జపాన్ ప్రజలు కూడా మనకంటే మూడున్నర గంటల ముందే న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారు. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా సైతం జపాన్ మాదిరిగానే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, భారత్‌లు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి. 

అయితే .. ప్రపంచంలో భారత్ కంటే వెనుక న్యూఇయర్ జరుపుకునే దేశాలు వున్నాయి. మనకంటే ఐదున్నర గంటల వెనుకగా ఇంగ్లాండ్ కొత్త ఏడాదిని ఆహ్వానించనుంది. అలాగే న్యూయార్క్ వాసులు భారత్ కంటే 10.30 గంటల వెనుక కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. అమెరికా అడ్మినిస్ట్రేషన్‌లో వున్న బేకర్, హోవార్డ్ దీవులు అందరికంటే చివరిగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios