న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భయకంపితం చేస్తున్న  కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం  సగం మిలియన్ షార్క్ చేపలను చంపాల్సి వస్తోందని షార్క్ మద్దతు గ్రూప్ అభిప్రాయపడింది.

సొరచేపల్లో సహజ నూనె కరోనా వ్యాక్సిన్  కోసం ఉపయోగిస్తున్నారు.  ఈ నూనెను స్క్వాలేన్ గా పిలుస్తారు.  కరోనా నివారణకు తయారు చేస్తున్న టీకాలో ఈ నూనెను వాడడం ద్వారా టీకా యొక్క సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు దోహదపడనుందని  నిపుణులు చెబుతున్నారు.

ఒక టన్ను స్క్వాలెన్ తీయడానికి సుమారు 3 వేల సొరచేపలు అవసరమౌతాయని అంచనా.ప్రపంచంలోని ప్రస్తుతం ఉన్న జనాభాలోని ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ దక్కాలంటే  2,50,000 షార్క్ లు అవసరమౌతాయని కాలిఫోర్నియాకు చెందిన షార్క్ మిత్ర బృందం అభిప్రాయపడింది.

అయితే అవసరమైన పరిమాణాన్ని బట్టి షార్క్ చేపల అవసరం ఎక్కువయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.షార్క్ చేపల జాతుల్లో గల్పర్ , బాస్కింగ్  లలో స్క్వాలేన్ సమృద్ధిగా ఉంటుంది.

అడవి జంతువుల నుండి పండించడం ఎప్పటికీ స్థిరంగా ఉండదని  నిపుణులు చెబుతున్నారు.  స్క్వాలేన్ కోసం ప్రతి ఏటా మూడు మిలియన్ల సొర చేపలు చంపబడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

సౌందర్యం కోసం ఉత్పత్తి చేసే వస్తువుల్లో కూడ స్క్వాలేన్ ను ఉపయోగిస్తారు.స్క్వాలేన్ కోసం  షార్క్ లను చంపడం ద్వారా  ఆ జాతి అంతరించిపోయే అవకాశం ఉందనే భయాలు కూడ లేకపోలేదు.