Asianet News TeluguAsianet News Telugu

అమెరికా జూలో గొరిల్లాలకు కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. తాజాగా కరోనా మనుషుల్నే కాదు మూగ జీవాల్నీ వదలడం లేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అనేక మూగజీవులు కూడా కరోనా బారిన పడ్డాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు అమెరికాలో మొట్టమొదటిసారిగా గొరిల్లాలకు కూడా కరోనా సోకింది. 

Gorillas At San Diego Zoo Safari Park In US Diagnosed With Coronavirus - bsb
Author
Hyderabad, First Published Jan 12, 2021, 3:48 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. తాజాగా కరోనా మనుషుల్నే కాదు మూగ జీవాల్నీ వదలడం లేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అనేక మూగజీవులు కూడా కరోనా బారిన పడ్డాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు అమెరికాలో మొట్టమొదటిసారిగా గొరిల్లాలకు కూడా కరోనా సోకింది. 

అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాండియాగోలో ఉన్న ఓ జూ సఫారి పార్క్‌లో పదుల సంఖ్యలో గొరిల్లాలకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో గొరిల్లాలకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. 

జూ సిబ్బందిలోని ఓ వ్యక్తి ద్వారానే గొరిల్లాలకు కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి గొరిల్లాల వద్దకు వెళ్లిన ప్రతిసారి మాస్క్ ధరించాడని, అయినప్పటికి కరోనా సోకిందని తెలిపారు. 

కరోనా పరీక్షల్లో ఆ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతడి ద్వారానే కరోనా సోకినట్టు నిర్థారించారు. ఇప్పటివరకు గొరిల్లాలకు ఎటువంటి వైద్యం అందించలేదని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. 

కాగా.. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం డిసెంబర్ ఆరో తేదీ నుంచి లాక్‌డౌన్ విధించింది. అప్పటి నుంచి ఈ జూను కూడా అధికారులు మూసివేసే ఉంచారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios