Asianet News TeluguAsianet News Telugu

పది గ్రాముల బంగారం ధర రూ.74వేలు

సోమవారం నాటి మార్కెట్  లో పాకిస్తాన్ లో పది గ్రాముల బంగారం ధర రూ.74,588 పలికింది. పాకిస్తాన్ పరిమాణంలో తులా బార్స్( 11.6638038గ్రాముల) బంగారం రూ.87,000 పలుకుతూ ఉంది. పాకిస్తాన్ లో ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతోంది.

Gold Rate In Pakistan, Price On 12 August 2019
Author
Hyderabad, First Published Aug 13, 2019, 10:22 AM IST

బంగారం ధర రోజు రోజుకీ పెరిగిపోతోంది. బంగారం కొనాలనుకునే సాధారణ ప్రజల గుండె గుభేల్ మంటోంది. కనీసం పది గ్రాముల బంగారం కూడా కొనలేమేమో అనే భావన కులుగుతోంది. వచ్చేది పెళ్లిళ్ల సీజన్. కచ్చితంగా బంగారం కొనక తప్పని పరిస్థితి. మరో వైపేమో... ధర ఆకాశాన్ని అంటుంది. మన దేశంలో ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర రూ.38వేలు పలుకుతోంది. 

ఇదే పది గ్రాముల బంగారం ధర పాకిస్తాన్ లో అంతకు రెట్టింపు పలుకుతుండటం గమనార్హం. సోమవారం నాటి మార్కెట్  లో పాకిస్తాన్ లో పది గ్రాముల బంగారం ధర రూ.74,588 పలికింది. పాకిస్తాన్ పరిమాణంలో తులా బార్స్( 11.6638038గ్రాముల) బంగారం రూ.87,000 పలుకుతూ ఉంది. పాకిస్తాన్ లో ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతోంది.

కరాచీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.74,500 ఉండగా.. 24 క్యారెట్ల తులా బార్ రూ.87వేలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.68,373గా ఉంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, క్వెట్టా, సియాల్ కోట్ నగరాల్లో 24 క్యారెట్లు, 24 క్యారెట్ల తుల బార్స్, 22 క్యారెట్ల బంగారం వరసగా రూ.74,588, రూ,87వేలు, రూ.88,373గా ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios