కరోనా విజృంభణ.. ప్రపంచవ్యాప్తంగా 85లక్షలు దాటిన కేసులు

4 లక్షల 56 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 85,78,283 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,56,286 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 45,30,266 మంది కోలుకున్నారు.

Global coronavirus death toll exceeds 450000

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతోంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 85 లక్షలు దాటాయి. 4 లక్షల 56 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 85,78,283 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,56,286 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 45,30,266 మంది కోలుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 22,63,651 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,20,688 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 9,30,994 మంది కోలుకున్నారు. బ్రెజిల్‌లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 9,83,359 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 47,869 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 5,20,360 మంది కోలుకున్నారు. రష్యాలో గత 24 గంటల్లో మొత్తం 5,61,091 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 7,660 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 3,13,963 మంది కోలుకున్నారు.


బ్రిటన్‌లో గత 24 గంటల్లో మొత్తం 3,00,469 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 42,288 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 30,262 మంది కోలుకున్నారు. ఇటలీలో కూడా కేసుల తీవ్రత కొంచెం తగ్గినట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో మొత్తం 2,38,159 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 34,514 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,80,544 మంది కోలుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios