అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల ఓ కరుడుగట్టిన ఉగ్రవాది తప్పించుకున్నాడని డచ్ జర్నలిస్ట్ బెటే డామ్ వెల్లడించారు. ఇలా ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరిస్తున్న అమెరికా కేవలం ఓ ఉగ్రవాద సంస్థ ఎత్తులకు చిత్తయిందన్నారు. అమెరికా సైనిక శిబిరాలకు కూత వేటు దూరంలో నివసిస్తున్న తాలిబన్‌ వ్యవస్ధాపకుడు ముల్లా మహ్మద్‌ ఒమర్‌ అలియాస్‌ ముల్లా ఒమర్‌ ను కూడా ఆ దేశ ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించలేకపోయారని బెటే కామ్ సంచలనం విషయాలను బయటపెట్టారు. 

అప్ఘనిస్తాన్ లో తాను పనిచేసిన సమయంలో అక్కడి ఉగ్రవాద కార్యాకలాపాలతో పాటు పలు అంశాలను సృశిస్తూ బెటే డామ్‌ ఓ పుస్తకాన్ని ప్రచురించి విడుదల చేశారు. ఈ పుస్తకంలో అమెరికా ట్విన్ ట్వవర్స్ దాడి, ఆ తర్వాత అమెరికా సైన్యం ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు.  

అమెరికాలోని ట్విన్ టవర్స్ దాడిలో ముఖ్యపాత్ర పోషించిన తాలిబన్ అధినేత ముల్లా మహ్మద్‌ ఒమర్‌ అప్ఘనిస్తాన్ లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. దీంతో అతడిని అంతమొందించడాని అమెరికా సైన్యం  ఆ ఇంటిని చుట్టిముట్టి జల్లేడపట్టినా ఒమర్ జాడను కనిపెట్టలేకపోయిందన్నారు. అయితే ఆ సమయంలో ఆయన అదే ఇంట్లో ఓ రమస్య గదిలో వున్నాడని...దీన్ని అమెరికా సైన్యం కనిపెట్టలేక ఒట్టి చేతులతో వెనుదిరిగిందని బెటే డామ్‌ తన పుస్తకంలో ప్రచురించారు.    

అమెరికా ట్విన్‌ టవర్స్‌పై దాడి అనంతరం ఒమర్‌ తలపై అగ్రదేశం కోటి డాలర్ల రివార్డును ప్రకటించింది.  కాగా అల్‌ఖైదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌ మాదిరిగానే ఒమర్‌
సైతం పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడని అమెరికా భావిస్తోంది. ఈ సమయంలో బేటే డామ్ విడుదలచేసిన పుస్తకం సంచలనాలకు కేంద్రంగా మారింది.