ఒక్కోసారి అధికారుల నిర్లక్ష్యం కొంతమంది కొంపముంచుతుంది. బతికుండగానే వారిని చంపేస్తుంది. అలాంటి సంఘటనలు మనదేశంలోనూ, మనరాష్ట్రంలోనూ అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఇలాంటిదే ఓ సంఘటన ఫ్రాన్స్ లో జరిగింది. ఆ బాధితురాలు తాను బతికున్నానని గుర్తించమంటూ కోర్టు చుట్టూ తిరుగుతోంది.
ఒక్కోసారి అధికారుల నిర్లక్ష్యం కొంతమంది కొంపముంచుతుంది. బతికుండగానే వారిని చంపేస్తుంది. అలాంటి సంఘటనలు మనదేశంలోనూ, మనరాష్ట్రంలోనూ అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఇలాంటిదే ఓ సంఘటన ఫ్రాన్స్ లో జరిగింది. ఆ బాధితురాలు తాను బతికున్నానని గుర్తించమంటూ కోర్టు చుట్టూ తిరుగుతోంది.
ఫ్రాన్స్‌లో ఓ 58 ఏళ్ల మహిళ తాను బతికే ఉన్నానని, ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలని కోరుతూ కోర్టులో పోరాడుతోంది. అంతేకాదు 2017 నవంబర్ నుంచి ప్రభుత్వ సంస్థలను కోరుతుంది.
అసలేం జరిగిందంటే.. జాన్ ఫౌచెన్ అనే మహిళ చనిపోయిందంటూ ఆమె భర్తతో పాటు పని చేసిన ఓ ఉద్యోగి ప్రభుత్వానికి తెలియజేశాడు. దీంతో అధికారులు ఆమెకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి రికార్డులను శాశ్వతంగా తొలగించారు.
ప్రస్తుతం ఆమె ఉద్యోగం కూడా కోల్పోయి.. ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు కారణం ఏంటి అంటే ఫౌచైన్, ఆమె భర్త, కొడుకు పని చేస్తున్న క్లీనింగ్ కంపెనీ 2000 సంవత్సరంలో ఓ పెద్ద కాంట్రాక్ట్ కోల్పోయింది.
ఆ తర్వాత 2004లో కార్మిక ట్రిబ్యునల్ ఫౌచైన్‌ను 14 వేల యూరోల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే అదృష్టవశాత్తు కేసు సంస్థపై రిజిస్టర్ కావడంతో ఫౌచైన్ బతికి పోయిది. ఈ క్రమంలో ఆ మాజీ ఉద్యోగి ఇదే కేసులో ఫౌచైన్ భర్త, కొడుకు మీద కేసు ఎలాగైనా నెగ్గాలని ఫౌచైన్ చనిపోయిందని ఫేక్ పత్రాలను సమర్పించాడు.
దాంతో అధికారులు ఆమెకు సంబంధించిన రికార్డులను శాశ్వతంగా తొలగించారు. దీంతో ఒదలలేదు ఆ మాజీ ఉద్యోగి ఫౌచైన్‌పై రెండుసార్లు కేసు పెట్టడానికి ప్రయత్నించాడు కాని ఫలించలేదు.
ఈ సందర్భంగా ఫౌచైన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఇది ఒక మతిలేని కేసు. అధికారులు ఎలాంటి దర్యాప్తు, ఆధారాలను తనిఖీ చేయకుండా ఆమె చనిపోయిందని ప్రకటించారు. ఒక్కరు కూడా క్రాస్ చెక్ చేసుకోలేదు’ అంటూ మండిపడ్డారు.
మరికొందరు మాత్రం కాంట్రాక్ట్ లాస్ కేసులో నుంచి బయటపడటం కోసం ఫౌచైన్ తప్పుడు పత్రాలు సృష్టించిందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. ‘నేను మరణించలేదని.. సంస్థలు తెలుపుతున్నాయి.. అలా అని నేను బతికి ఉన్నానని కూడా ప్రకటించడం లేదు. ఈ ప్రకటన చేయించడం కోసం నేను ఫైట్ చేస్తున్నాను’ అంటూ ఫౌచైన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 12, 2021, 4:06 PM IST