French Presidential Elections: ఫ్రెంచ్ ప్రెసిడెన్షియల్ రేసులో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గెలుపు పొందారు. ప్రత్యర్థి మెరీన్‌ లీ పెన్‌పై  మాక్రాన్‌ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించారు. దీంతో మరో ఐదేండ్ల పాటు అధ్యక్షుడిగా పదవిలో కొనసాగనున్నారు.  

French Presidential Elections: ఫ్రాన్స్ లో జ‌రిగిన ప్రెసిడెంట్ రేసులో ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్ మ‌రోసారి గెలుపొందారు. మరో ఐదేండ్ల పాటు అధ్యక్షుడిగా పదవిలో కొనసాగనున్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి మెరీన్‌ లీ పెన్‌పై ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ స్పష్టమైన విజయం సాధించారు. మాక్రాన్‌కు 58% ఓట్లు రాగా, పెన్‌కు 42% ఓట్లు పడ్డాయి. గడిచిన 20 ఏండ్ల కాలంలో వరుసగా రెండు సార్లు అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్‌ రికార్డు సృష్టించారు.

ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఫ్రెంచ్ రైట్ రైట్ వింగ్ నేత మెరైన్ లీ పెన్ విజ‌యం సాధిస్తార‌ని ఇటు మీడియా సంస్థ‌లు, ఎక్జ్సిస్ట్ పోల్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. లీ పెన్ కూడా తానే అఖండ విజయం సాధిస్తాన‌ని పెన్ పేర్కొన్నారు. ఈ అంచ‌నాల‌న్నింటీని మాక్రాన్ తిరగ‌రాస్తూ.. విజ‌యం సాధించారు. 

కేవలం ఐదేళ్లలో.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రాజకీయాల్లో యువనేత‌గా ఎదిగారు. యూరోపియన్ యూనియన్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే ప్రధాన ప్రపంచ నాయకుడిగా తనను తాను మార్చుకున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా విధించిన యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో దౌత్య పాల్గొన్నాడు.

బాహాటంగా మాట్లాడే మాక్రాన్, తన కనికరంలేని దౌత్య క్రియాశీలతతో తన స్వంత మార్గాన్ని ఎంచుకున్నారు. అంతర్జాతీయంగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఒపీనియన్ పోల్స్‌లో చాలా మంది ఫ్రెంచ్ పౌరులు ఆయనను అధ్యక్షుడిగా ప్రశంసించారు. COVID-19 మహమ్మారి, ఉక్రెయిన్ సంఘర్షణ వంటి ప్రధాన ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కోవడానికి అతన్ని సరిపోతారని చూస్తున్నారు.

రెండవసారి ఫ్రెంచ్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన మాక్రాన్‌కు ప్రపంచవ్యాప్తంగా నాయకుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి.
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఫ్రెంచ్ అధ్యక్షుడిని అభినందించారు. 'ఫ్రాన్స్ మా అత్యంత సన్నిహిత, అత్యంత ముఖ్యమైన మిత్రదేశాలలో ఒకటి.' ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైనందుకు అభినందనలు' అని ఆయన అన్నారు. ఫ్రాన్స్ త‌మ‌కు అత్యంత సన్నిహితమైన, అత్యంత ముఖ్యమైన మిత్రదేశాలలో ఒకటని, అత్యంత ముఖ్యమైన సమస్యలపై కలిసి పని చేయాల‌ని ఎదురుచూస్తున్నామ‌ని తెలిపారు.

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. అత్యంత ముఖ్యమైన సమస్యలపై కెనడా, ఫ్రాన్స్ లు క‌లిసి పని చేయల‌ని ఎదురుచూస్తున్నామనీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, వాతావరణ మార్పులతో పోరాడటం, ఉపాధి మార్గాల‌ను సృష్టించడంపై క‌లిసి ప‌ని చేద్దామ‌ని ఆశించారు. 

స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్.. మాక్రాన్ ను అభినందించారు. స్వేచ్ఛా, బలమైన, న్యాయమైన యూరోపియన్ యూనియన్ సాధ‌న‌కు కృషి చేద్దామ‌ని పేర్కొన్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్.. మాక్రాన్ ను అభినందించారు. "ఆరోగ్యకరమైన, సురక్షితమైన, న్యాయమైన ప్రపంచం కోసం ఫ్రాన్స్, WHO మధ్య భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.