అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై మాజీ మోడల్ ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో..  ట్రంప్ పై ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. 1997లో న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ జరుగుతుండగా ట్రంప్ తన వీఐపీ సూట్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మాజీ మోడల్ అమీ డోరిస్ చెప్పారు.

"అతడు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని చూశాడు. తన నాలుకను నా గొంతు క్రిందకు కదిలించే ప్రయత్నం చేయగా నేను అతనిని నెట్టివేశాను. ఆపై అతడి పట్టు గట్టిగా మారింది. అతడు తన చేతులతో నా శరీరంపై ఎక్కడెక్కడో ముట్టుకున్నాడు. నేను ఆయన పట్టులో ఉండిపోయి బయటపడలేకపోయాను" అని డోరిస్ ఒక పత్రికకు ఇచ్చని ఇంటర్వ్యూలో వెల్లడించింది.

డొనాల్డ్ ట్రంప్ లైంగిక దుష్ప్రవర్తనపై ఇప్పటివరకు డజనుకు పైగా ఆరోపణలను ఎదుర్కొన్నాడు. 1990 మధ్యలో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లోని గదిలో ప్రముఖ అమెరికన్ కాలమిస్ట్ ఈ జీన్ కారోల్ పై కూడా లైంగికదాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడం కోసం వాటన్నింటినీ పక్కన పెట్టేశాడు. 2016 ఎన్నికలకు కొంతకాలం ముందు బయటపడిన టేప్ రికార్డింగ్ లో కూడా ట్రంప్ లైంగికదాడికి సంబంధించిన ట్రంప్ ప్రగల్భాలు ఉన్నాయి. ట్రంప్ దీనిని "లాకర్ రూమ్ బాంటర్" అని కొట్టిపారేశారు. కానీ తరువాత క్షమాపణలు చెప్పారు.  కాగా.. తాజాగా ఈ మోడల్ చేస్తున్న ఆరోపణలు ట్రంప్ కి ఎన్నికల్లో ఎలాంటి ఎఫెక్ట్ చేస్తాయో తెలియాల్సి ఉంది.