అమెరికన్ మాజీ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా... చేనేత దుస్తుల్లో మెరిసిపోయారు. తాను హైదరాబాద్ లో లేనప్పటికీ... తాను చేనేత దుస్తులనే ధరించానని ఆమె చెప్పడం విశేషం. తాను ప్రస్తుతం కాన్సులేట్‌లో లేనప్పటికీ ఈరోజు చేనేత దుస్తులనే ధరించానని బుధవారం ట్వీట్‌ చేసి కొన్ని ఫొటోలను జతచేశారు. 

ఆమె కాన్సుల్‌ జనరల్‌గా ఉన్న సమయంలో చేనేత రంగానికి తగిన ప్రాధాన్యం కల్పించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో సిబ్బంది మొత్తం చేనేత దుస్తుల్లో విధులకు హాజరవడం గమనార్హం.  

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మృతిపై యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్‌తో కలసి సుష్మ సమావేశమైన ఫొటోను పోస్టు చేసింది.