కాంగోలో వరదలు.. కొండచరియలు విరిగిపడి 60మంది మృతి...
కాంగో నది ఒడ్డున ఉన్న రాజధాని కిన్షాసా, కసాయి ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలతో సహా శుక్రవారం దేశంలోని ఇతర ప్రాంతాలను కూడా వరదలు ప్రభావితం చేశాయి.
కాంగో : తూర్పు కాంగోలోని దక్షిణ కివు ప్రాంతాన్ని తాకిన కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 20 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. దీంతో గత వారంలోనే కాంగోలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 60కి పైగా చేరుకుంది.
మ్వెంగా భూభాగంలోని బుర్హిని ప్రాంతంలో గురువారం కొండచరియలు విరిగిపడిన నివాసాలు పూర్తిగా నేలమట్టం అయినట్టు అధికారులు తెలిపారు. "కొండచరియలు విరిగిపడటంతో ఇళ్ళు కింద సమాధి అయ్యి దాదాపు 20 మంది మృతి చెందారు’’ అని టెరిటరీ అడ్మినిస్ట్రేటర్ వాలుబిలా ఇషికిటిలో చెప్పారు.
Miracle: 40 నిమిషాలు మరణించి లేచింది.. చావు అనుభవాలను ఇలా చెప్పింది..!
బాధితుల కోసం అత్యవసర సహాయాన్ని మోహరిస్తున్నట్లు, ఆ ప్రాంతం నుండి నివాసితులను ఖాళీ చేయిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. కాంగో నది ఒడ్డున ఉన్న రాజధాని కిన్షాసా, కసాయి ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలతో సహా శుక్రవారం దేశంలోని ఇతర ప్రాంతాలను కూడా వరదలు ప్రభావితం చేశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కమిటుగాలో మంగళవారం 20మందికి పైగా ఆర్టిసానల్ మైనర్లు కొండచరియలు విరిగిపడి మరణించిన 48 గంటల తర్వాత తాజా మరణాలు సంభవించాయి.
బుధవారం, దక్షిణ కివు ప్రాంతంలోని బుకావులో కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారు. అనధికార స్థలాల్లో అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్లే దక్షిణ కివునలో కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల నష్టం వాటిల్లిందని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు.