Asianet News TeluguAsianet News Telugu

తొలి ఫిట్ ఇండియా క్విజ్ ఫలితాలు విడుదల.. ప్రిలిమినరీ రౌండ్‌లో యూపీ విద్యార్థులు టాప్

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తొట్ట తొలి ఫిట్ ఇండియా క్విజ్ పోటీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ అతిపెద్ద స్పోర్ట్స్, ఫిట్‌నెస్ క్విజ్ పోటీలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ప్రిలిమినరీ రౌండ్ క్విజ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. తాజాగా, ఈ ప్రిలిమినరీ రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో యూపీకి చెందిన ఇద్దరు విద్యార్థులు టాపర్లుగా నిలిచారు.
 

fit india quiz results out.. UP students top in preliminary round
Author
New Delhi, First Published Jan 25, 2022, 8:05 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తొట్ట తొలి ఫిట్ ఇండియా క్విజ్(Fit India Quiz) ఫలితాలు (Results) విడుదల అయ్యాయి. ఇది భారత దేశంలో విద్యార్థులకు నిర్వహించే అతిపెద్ద క్రీడా, ఫిట్‌నెస్ క్విజ్‌ పోటీ. ఈ పోటీలకు సంబంధించిన ప్రిలిమినరీ రౌండ్ ఫలితాలను కేంద్ర ప్రకటించింది. ఈ ప్రాథమిక రౌండ్‌లో యూపీ విద్యార్థులు (Uttar Pradesh Students) తమ సత్తా చాటారు. యూపీకి చెందిన ఇద్దరు విద్యార్థులు దేశవ్యాప్తంగా పాల్గొన్న అందరిక విద్యార్థుల కన్నా అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. గ్రేటర్ నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి దివ్యాంషు చమోలి, వారణాసిలో లాహార్తరాకు చెందిన సన్‌బీమ్ స్కూల్ స్టూడెంట్ శాశ్వత్ మిశ్రాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఈ అతిపెద్ద స్పోర్ట్స్, ఫిట్‌నెస్ క్విజ్ పోటీలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ప్రిలిమినరీ రౌండ్ క్విజ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఐఐటీ, జేఈఈ ప్రవేశ పరీక్షలను ఈ ఏజెన్సీనే నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. 

కాగా, బాలికల్లో తొలి, ద్వితీయ స్థానాల తర్వాత కర్ణాటకకు చెందిన ఆక్రమిత టాపర్‌గా ఉన్నారు. ఆమె కర్ణాటకలో టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. బెంగళూరులోని బాల్డ్‌విన్ గర్ల్స్ హై స్కూల్‌లో చదువుకుంటున్నది. ప్రిలిమినరీ రౌండ్ క్విజ్ కోసం దేశవ్యాప్తంగా 13,502 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి దేశంలోని 659 జిల్లాలకు చెందినవి. ఇందులో నుంచి 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 361 పాఠశాలల విద్యార్థులు షార్ట్‌లిస్ట్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్విజ్ పోటీల్లో ప్రైజ్ మనీ రూ. 3.25 కోట్లుగా ఉన్నది. ఇవి వివిధ రౌండ్‌లలో విద్యార్థులకు, పాఠశాలకు వెళ్తాయి.

ప్రిలిమినరీ రౌండ్‌లలోని టాప్ స్కోరర్లు స్టేట్ రౌండ్ కాంపిటీషన్‌కు షార్ట్ లిస్ట్ అవుతారు. ఆ పోటీల్లో స్టేట్ చాంపియన్లను గుర్తిస్తారు. అందులో నుంచి 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పాఠశాలలు నేషనల్ రౌండ్‌లోకి వెళ్తాయి. ఈ నేషనల్ రౌండ్ పోటీలు ఈ ఏడాదిలోనే జరుగుతాయి. ఆ పోటీలు స్టార్ స్పోర్ట్స్, సోషల్ మీడియా చానెళ్లలో వెబ్‌క్యాస్ట్ కూడా చేస్తారు. 

ఈ క్విజ్ పోటీల ప్రథమ లక్ష్యం విద్యార్థుల్లో మన దేశానికి ఉన్న ఉన్నతమైన క్రీడా చరిత్రపై అవగాహన కల్పించడం అని కేంద్రం తెలిపింది. అంతేకాదు, మన దేశానికి చెందిన శతాబ్దాల కిందటి ఘనమైన క్రీడా చరిత్ర, అంతేకాదు, జాతీయంగా, ప్రాంతీయంగా పేరుమోసిన క్రీడాకారులపై అవగాహన కల్పించనున్నట్టు వివరించింది.

ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవడానికి fitindia.nta.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఈ ఫలితాలపై ఫిట్ ఇండియా మూమెంట్ ట్వీట్ చేసింది. మీరు ఇన్నాళ్లు ఎదురుచూసిన సమయం వచ్చేసిందని పేర్కొంటూ ఫిట్ ఇండియా మూమెంట్ ట్వీట్ చేసింది. ఫిట్ ఇండియా క్విజ్ మూమెంట్ ఫలితాలు వచ్చాయని ట్విట్టర్ వేదికగా ఫిట్ ఇండియా మూమెంట్ ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios