Asianet News TeluguAsianet News Telugu

భద్రతా మండలిలో కాశ్మీర్ అంశం: 1965 తర్వాత నేడు మరోసారి

జమ్మూ కాశ్మీర్  అంశంపై యూఎన్ భద్రతా మండలిలో శుక్రవారం నాడు చర్చించనున్నారు. 1965లో జమ ్మూ కాశ్మీర్ అంశంపై తొలుత చర్చించారు. 

First Since 1965, UN Security Council to Hold Rare Closed-Door Meeting on Kashmir Today on China, Pak Request
Author
Washington D.C., First Published Aug 16, 2019, 6:26 PM IST

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారంనాడు చర్చించనుంది. పాకిస్తాన్, చైనా వినతి మేరకు భద్రతా మండలి ఈ నిర్ణయం తీసుకొంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఈ విషయమై క్లోజ్డ్ డోర్స్ మధ్య జరగనుంది. 1965లో పూర్తిస్థాయి భద్రతా మండలి సమావేశంలో కాశ్మీర్ అంశంపై చర్చించారు.

ఆ తర్వాత ఇదే అంశంపై భద్రతా మండలిలో ఇవాళ చర్చించనున్నారు. ఇవాళ పూర్తిస్థాయి భద్రతా మండలి ఈ అంశంపై చర్చించదని భద్రతా మండలి వర్గాలు ప్రకటించాయి.

జమ్మూ కాశ్మీర్ అంశంపై చర్చించాలని  పాక్ తో పాటు చైనా కూడ  కోరిందని ఐక్యరాజ్యసమితి భద్రతా వర్గాలు తెలిపాయి. క్లోజ్డ్ డోర్స్ సమావేశం నిర్వహించాలని  చైనా కోరినట్టుగా ఆ వర్గాలు ప్రకటించాయి.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.ఈ నిర్ణయం పాక్ కు మింగుడపడడం లేదు. 

ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇదివరకు ఐక్యరాజ్యసమితి కార్యదర్శిని పాక్ కోరింది.ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఐక్యరాజ్యసమితి పాక్ కు తేల్చి చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios