Omicron Variant : ఒమిక్రాన్ ఫస్ట్ ఫొటో రిలీజ్ చేసిన రోమ్ హాస్పిటల్...ఇదేంటి ఇలా ఉంది.. !
తాజాగా రోమ్ లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒమిక్రాన్ మొదటి ఫొటోను విడుదల చేసింది. ఈ చిత్రం ఒక మ్యాప్ లా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ లో ఎక్కువ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటిరకు కరోనా వైరస్ లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్ ఒమిక్రాన్ అని వెల్లడించింది.
ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందనుకుంటున్న corona virus మరో కొత్త రూపం దాల్చి ప్రజల ముందుకు వచ్చింది. South Africaలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది.
ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు బెంబేలెత్తెతున్నారు. తాజాగా rome లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్ omicron మొదటి ఫొటోను విడుదల చేసింది. ఈ చిత్రం ఒక మ్యాప్ లా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ లో ఎక్కువ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటిరకు కరోనా వైరస్ లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన Variant ఒమిక్రాన్ అని వెల్లడించింది. ఒమిక్రాన్ ఉత్పరివర్తనలు మరింత ప్రమాదకరమైనవి రోమ్ పరిశోధకుల బృందం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయని పేర్కొంది.
అయితే, ఒమిక్రాన్ తో వ్యాప్తి ప్రభావం పెరుగుతోందా లేదా వ్యాక్లిన్ల ప్రభావం తగ్గుతుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమని పరిశోధనకులు పేర్కొన్నారు. కాగా డెల్టాతో సహా ఇతర వేరియంట్ లతో పోల్చితే ఒమిక్రాన్ మరింతగా వ్యాపించగలదా అనేది.. ఇంకా స్పష్టంగా తెలియదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఒమిక్రాన్.. ఇతర కోవిడ్ వేరియంట్ ల కంటే భిన్న లక్షణాలు ఉన్నాయడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.
ఇదిలా ఉండగా, కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చాలా దేశాలు ఈ భయంతో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాలు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే లాక్‌డౌన్‌లు విధించేందుకు సిద్దమవుతున్నాయి. అయితే ఒమిక్రాన్‌కు సంబంధించి అన్ని చెడు వార్తలే కాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలుత South Africaలో గుర్తించిన ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులలో చాలా తేలికపాటి లక్షణాలు ఉన్నట్టుగా నివేదికలు వెలువడుతున్నాయి.
Omicron: డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రమాదకరమా?.. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందంటే..
అయితే కరోనా విజృంభణ తర్వాత.. Delta mutation జనాలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతానికి ఆ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రాణాంతకమైన డెల్టా మ్యుటేషన్.. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల ప్రమాదం తగ్గుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
తొలుతు పేషెంట్లలో కొత్త వేరియంట్‌ను అనుమానించిన ఒకరైన దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ Dr. Angelique Coetzee మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇంట్లోనే చికిత్స చేయవచ్చని తెలిపారు. ఆమె రాయిటర్స్ వార్త సంస్థతో మాట్లాడుతూ.. తన క్లినిక్‌లో డెల్టా వేరియంట్‌కు భిన్నమైన లక్షణాలను కలిగి ఉన్న ఏడుగురు రోగులను గమనించినట్లు చెప్పారు. అయితే అవి చాలా తేలికపాటి లక్షణాలు అని చెప్పారు.
వ్యాక్సిన్‌లపై మంత్రుల సలహా కమిటీలో సభ్యునిగా ఉన్న కోయెట్జీ మాట్లాడుతూ.. ఈ వేరియంట్ బారినపడ్డ వారు వాసన లేదా రుచి కోల్పోయినట్లు నివేదించలేదని తెలిపారు. కొత్త వేరియంట్‌తో ఆక్సిజన్ స్థాయిలలో పెద్దగా తగ్గుదల లేదని చెప్పారు.
ఇక, డెల్టా, ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తుందా..? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఆర్టీ పీసీఆర్ (RT-PCR) పరీక్షలు ఈ వేరియంట్‌ను గుర్తించగలవని పేర్కొంది.