Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో తొలి భారతీయ పోలీసు అధికారి రిటైర్

అమెరికాలో పోలీసు అధికారిగా సేవలు అందించిన తొలి భారతీయుడు బల్బీర్ మహాయ్ ఆదివారం రిటైర్ అయ్యారు. వాషింగ్టన్‌లో విస్కాన్సిన్ సిటీలోని గురుద్వారాలో ఈ సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహించారు.
 

first indian police officer in america retires in milwaukee city
Author
First Published Feb 8, 2023, 8:00 PM IST

న్యూఢిల్లీ: అమెరికాలో పోలీసు అధికారిగా పని చేసిన తొలి భారతీయుడు బల్బీర్ మహాయ్ ఆదివారం రిటైర్ అయ్యారు. ఆయన మిల్వాకీ సిటీలో పోలీసు అధికారిగా 21 సంవత్సరాలు సేవలు అందించారు. వాషింగ్టన్‌లోని ఓ గురుద్వారాలో ఆయన పదవీ విరమణ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. విస్కాన్సిన్‌లోని ఓక్ క్రీక్ గరుద్వారాలో ఆయన పదవీ విరమణను వేడుక చేసుకున్నారు. 

2012లో శ్వేత జాత్యహంకరుడు ఈ గురుద్వారాలోనే కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. అంతేకాదు, ఓ సిక్కు మత గురువుకు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఫలితంగా కొన్నాళ్లు ఆయన పక్షవాతం బారిన పడి ఆ తర్వాత మరణించాడు.

ఈ ఘటన జరిగిన గురుద్వారాలోనే బల్బీర్ మహాయ్ పదవీ విరమణ వేడుక చేసుకున్నారు. ఆ కాల్పుల ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే బల్బీర్ మహాయ్ ఆ గురుద్వారాకు వెళ్లారు. 

ఈ కార్యక్రమంలో బల్బీర్ మహాయ్ మాట్లాడారు. తన కెరీర్‌కు సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆయన తన కమ్యూనిటీకి, ఇండియన్ కమ్యూనిటీకి, మిల్వాకీ పోలీసు శాఖకు, స్నేహితులు, కుటుంబాలందరికీ ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి తీసుకువచ్చి, ఇంతటి గౌరవం పొందడానికి కారుకులైన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. మీ అందరి సహాయ సహకారాలతోనే నేను పదవీ విరమణ పొందుతున్నాను. ఈ విషయంపై నేనెంతో సంతోషంగా ఉన్నాను’ అని అన్నారు.

Also Read: అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి కేసులో ఊహించని ట్విస్ట్..!

ఈ కార్యక్రమానికి మిల్వాకీ మేయర్ కావలీర్ జాన్సన్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం, ఆయన ట్వీట్ చేసి అతనిపై ప్రశంసలు కురిపించారు. నిన్న నేను బల్బీర్ మహాయ్‌కు సత్కారం చేయడానికి గురుద్వారాకు వెళ్లాను. మిల్వాకీ పోలీసు శాఖ నియమించుకున్న తొలి భారతీయ పోలీసు అధికారి అతను. మా నగరానికి 20 ఏళ్లుగా డెడికేటెడ్ సర్వీస్ అందించినందుకు బల్బీర్, ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. 

గురుద్వారాలో సభ్యుడైన మహాయ్ 1999లో అమెరికాకు వెళ్లారు. అక్కడ మిల్వాకీ కౌంటి షెరీఫ్ ఆఫీసులో ఒక ఏడాది పాటు పని చేశారు. ఆ తర్వాత మిల్వాకీ పోలీసు శాఖలో చేరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios