Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ వజీరాబాద్ లో కాల్పులు:మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గాయాలు

పాకిస్తాన్ లో  గురువారంనాడు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో  పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి  ఇమ్రాన్ కాన్  గాయపడ్డారు. 

Firing at Imran Khan during a rally in Pakistan
Author
First Published Nov 3, 2022, 5:07 PM IST

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని పంజాబ్  ఫ్రావ్నిన్ లో  గురువారంనాడు జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్  ఖాన్ గాయపడ్డారు.ఈ ఘటనలో ఇమ్రాన్ తో పాటు మరో నలుగురు కూడ గాయపడ్డారని  తెలుస్తుంది.పాకిస్తాన్  లోని  పంజాబ్  ఫ్రావ్సిన్ లోని వజీరాబాద్  నగరంలో  గురువారంనాడు  నిర్వహించిన  ర్యాలీలో గుర్తు తెలియని దుండగులు  కాల్పులు జరిపారు.ఇమ్రాన్  ఖాన్ తో  పాటు ఆయన మాజీ మేనేజర్  రషీద్,  మాజీ గవర్నర్ సింథ్  ఇమ్రాన్ ఇస్మాయిల్ కూడ  గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయమైందని మీడియా  నివేదికలు చెబుతున్నాయి. కాల్పులు  జరిగిన వెంటనే  ఇమ్రాన్ ఖాన్  ను బుల్లెట్ ఫ్రూఫ్  వాహనంలోకి మార్చారు. ర్యాలీ సందర్భంగా ఓపెన్ టాప్  వాహనంలో ఉన్నారు. ఈ సమయంలో  కాల్పులు  జరిగాయి.  

పాకిస్తాన్  ప్రధానమంత్రి షెహబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నిర్వహించిన  లాంగ్ మార్చ్ లో  భాగంగా  ఇవాళ  ర్యాలీ  నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్టుగా  మీడియా నివేదికలు  తెలిపాయి.  2007 లో  జరిగిన ర్యాలీలో  పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో ను కాల్చి  చంపిన విషయం  తెలిసిందే.గుజ్రాన్ వాలాలోని అల్లావాలా చౌక్ లో ఇమ్రాన్ఖాన్  క్యాంప్ సమీపంలో  కాల్పులు  జరిగిన తర్వాత  గందరగోళ దృశ్యాలు  చోటు చేసుకున్నాయని  జియో న్యూస్  చానెల్ నివేదించింది.ఇమ్రాన్  ఖాన్  పై కాల్పులు జరిపిన దుండగుడిని  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారని  సమాచారం. కాల్పులు ఎందుకు జరిపారనే  విషయమై  పోలీసులు విచారణ  జరుపుతున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios