మెక్సికోలోని ఓ వలసశిబిరంలో అగ్నిప్రమాదం జరిగింది. దీని కారణంగా 10మంది మృతి చెందారు. దాదాపు 37మంది క్షతగాత్రులయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

మెక్సికో: యుఎస్ సరిహద్దుకు సమీపంలో ఉన్న మెక్సికోలోని సియుడాడ్ జుయారెజ్‌లోని వలసదారుల శిబిరంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది మరణించారని స్థానిక ప్రభుత్వంలోని రెండు వర్గాలు రాయిటర్స్‌కి తెలిపాయి. వీరిని కాపాడేందుకు రెస్క్యూ టీం పనిచేస్తుంది. ఇప్పటివరకు క్షతగాత్రులైన 37మందిని వీరు కాపాడారు. క్షతగాత్రులైన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred