బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకాలో ఇరుకుగా ఉండే బనాయ్ అనే కమర్షియల్ ప్రాంతంలోని ఎఫ్‌ఆర్ టవర్స్ అనే ఎత్తయిన భవంతిలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది.

సమాచారం అందుకున్న సహాయక బృందాలు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొంతమంది కిటికీల్లోంచి బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి మరణించినట్లు స్థానికులు తెలిపారు.

ప్రాణాలు దక్కించుకునేందుకు జనం భారీ క్రేన్లు, సైనిక హెలికాఫ్టర్ల సాయంతో వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది చనిపోగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.