ఉక్రెయిన్‌లో (ukraine) భీకర యుద్ధం కొనసాగుతోంది. ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ రష్యా సైన్యం (russia army) ముందుకు సాగుతోంది. ప్రధాన నగరాల్లో రష్యా సేనలను ఉక్రెయిన్ ఆర్మీ అడ్డుకుంటోంది. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోకి ఇప్పటికే రష్యా బలగాలు ప్రవేశించాయి.
ఉక్రెయిన్‌లో (ukraine) భీకర యుద్ధం కొనసాగుతోంది. ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ రష్యా సైన్యం (russia army) ముందుకు సాగుతోంది. ప్రధాన నగరాల్లో రష్యా సేనలను ఉక్రెయిన్ ఆర్మీ అడ్డుకుంటోంది. ఉక్రెయిన్ ప్రజలు కూడా ఆయుధాలు చేతబట్టి కదనరంగంలోకి దిగుతున్నారు. రాజధాని కీవ్‌లో హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. సైనిక , ఇంధన స్థావరాలే లక్ష్యంగా రష్యా బలగాలు దాడులకు దిగుతున్నాయి. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోకి ఇప్పటికే రష్యా బలగాలు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో రేపటి వరకు కర్ఫ్యూ విధించింది ఉక్రెయిన్ ప్రభుత్వం.
మరోవైపు ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సామాగ్రి పంపుతామని ప్రకటించాయి జర్మనీ, ఫ్రాన్స్. ఖార్కివ్‌లో గ్యాస్ పైప్‌లైన్ పేల్చిసినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. 4300 మంది రష్యా సైన్యం చనిపోయారని ప్రకటించాయి ఉక్రెయిన్ వర్గాలు. యుద్ధంలో 198 మంది మృతి చెందగా.. వెయ్యికి పైగా గాయపడినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అలాగే 975 ఉక్రెయిన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. 471 మంది ఉక్రెనియన్లను అదుపులోకి తీసుకున్నట్లు రష్యా వెల్లడించింది. ఇళ్లు, బంకర్లు సబ్‌వే స్టేషన్‌లో తలదాచుకుంటున్నట్లు ఉక్రెయిన్ ప్రజలు తెలిపారు.
మరోవైపు.. తాము ఉక్రెయిన్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, దొంబాస్ రీజియన్‌లోని డీపీఆర్, ఎల్‌పీఆర్‌ల రక్షణ కోసమే తాము ఈ మిలిటరీ ఆపరేషన్(Military Operation) చేపడుతున్నామని చెప్పింది. అంతేకాదు, ఇటీవలే.. మరో ఆరోపణ కూడా చేసింది. ఉక్రెయిన్ చర్చలు జరపడానికి సిద్ధంగా లేదని, ఈ ఘర్షణలను పొడిగించాలనే భావిస్తున్నదని మండిపడింది.
సైనిక చర్య ప్రారంభానికి ముందూ చర్చలు జరపాలని, ఆ దారిలోనే ఉద్రిక్తతలు సమసిపోవడానికి కృషి చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. తాము చర్చలకు సిద్ధం అని, చర్చలకు లొకేషన్‌ను రష్యాకే విడిచిపెడుతున్నామని కూడా పేర్కొన్నారు. తాజాగా, ఈ సంక్షోభంపై చర్చించడానికి రష్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే చర్చలకు వేదికగా దాని మిత్ర దేశం బెలారస్‌ను వేదికగా సూచించింది. బెలారస్ (Belarus)లోని గోమెల్‌లో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. కానీ, ఈ ఆఫర్‌ను ఉక్రెయిన్ తిరస్కరించింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పూర్వం బెలారస్‌లో మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. అక్కడి నుంచీ ఉక్రెయిన్‌పై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే తమ దేశంపై దాడులకుగా వేదిగా ఉన్న బెలారస్‌లో శాంతి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా లేని ఉక్రెయిన్ చెబుతున్నది. రష్యాతో తమకు నిజమైన చర్చలు అవసరం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ సలహాదారు వెల్లడించారు. రష్యా మిలిటరీ దాడులపై ఎలాంటి అల్టిమేటమ్‌లు లేకుండా చర్చలు జరగాలని, కానీ, ఇప్పుడు రష్యా ఇచ్చిన శాంతి చర్చల ఆఫర్ కేవలం ప్రాపగండ మాత్రమేనని కొట్టిపారేశారు. ఉక్రెయిన్‌పై అభిప్రాయాలను తప్పుదారి పట్టించాలనే రష్యా ఈ ప్రకటన చేసిందని ఆరోపించారు. బెలారస్‌లో చర్చల కోసం తమ ప్రతినిధులను పంపించామని, ఉక్రెయిన్ అధికారుల కోసం ఎదురుచూస్తున్నామని రష్యా చెప్పడం కేవలం దుష్ప్రచారం కోసమేనని అన్నారు.
