వాషింగ్టన్: అమెరికాలో దాదాపు 68 ఏళ్ల తర్వాత ఓ మహిళకు మరణశిక్షను కోర్టు విధించింది.1953 లో ఒకరికి మరణశిక్షను విధించారు. ఆ తర్వాత లిసా ఎం. మాంటెగోమేరీ అనే నేరస్థురాలికి బుధవారంనాడు మరణశిక్షను అమలు చేశారు.

52 ఏళ్ల మేరీ ఓ గర్భిణీని హత్య చేసి ఆమె కడుపులోని బిడ్డను అపహారించింది. దీనికి తోడు ఆ బిడ్డను తన బిడ్డగా ప్రపంచానికి పరిచయం చేసింది.

ఈ విషయమై కోర్టులో సుధీర్ఘ కాలం కేసు నడిచింది. లిసా క్షమాభిక్షను కోర్టు తిరస్కరించింది. మంగళవారం నాడు అమెరికా కాలమానప్రకారంగా మంగళవారం నాడు (ఇండియాలో బుధవారంనాడు) ఆమెకు మరణశిక్షను అమలు చేశారు. విషపూరిత ఇంజక్షన్ ఇవ్వడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించారు.

లీసా ఒకసారి కుక్కను కొనుగోలు చేసేందుకు బాబీ స్టిన్నెట్ ఇంటికి వెళ్లింది. అప్పటికే లీసా గర్భిణీ అని చెప్పుకొనేది. కానీ ఆమె గర్భం దాల్చలేదు. బాబీ అప్పటికే గర్భవతి. బాబీ బిడ్డను అపహరించాలని లీసా ప్లాన్ వేసింది.

బాబీ గొంతు కోసి చంపేసింది. ఆమె గర్భాన్ని కోసి ఆడబిడ్డను అపహరించింది. ఆ పసికందును తన బిడ్డగా చెప్పుకొంది.ఈ విషయం తెలిసిన స్థానికులు భయంతో వణికిపోయారు.

లీసా అపహరించిన బిడ్డకు 16 ఏళ్లు నిండాయి. లీసా చేసిన పనికి ఆమెకు మరణశిక్షే సరైందిగా తేల్చాయి.