Asianet News TeluguAsianet News Telugu

చిన్నారులకు వ్యాక్సిన్.. 5 నుంచి 11 ఏళ్ల వారికి ఫైజర్ టీకా.. ఆమోదం తెలిపిన ఎఫ్‌డీఏ

చిన్నారులకు కోవిడ్ టీకా (COVID-19 vaccine) పంపిణీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 5 నుంచి 11 ఏళ్ల వయసున్న చిన్నారుల కోసం ఫైజర్ (Pfizer) రూపొందించిన​ టీకాకు ఆమోదం తెలిపింది.

FDA clears way for Pfizer COVID-19 vaccinations in young kids between 5 and 11 years
Author
Washington D.C., First Published Oct 30, 2021, 1:14 PM IST

చిన్నారులకు కోవిడ్ టీకా (COVID-19 vaccine) పంపిణీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 5 నుంచి 11 ఏళ్ల వయసున్న చిన్నారుల కోసం ఫైజర్ (Pfizer) రూపొందించిన​ టీకాకు ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగం కింద ఈ టీకాకు అనుమతిస్తున్నట్టుగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తెలిపింది. ఈ నిర్ణయంతో అమెరికాలో దాదాపు 2.8 కోట్ల మంది పిల్లలు వచ్చే వారం నుంచి టీకా తీసుకోవడానికి అవకాశం కల్పించినట్టైంది. అయితే నవంబర్ 2వ తేదీన ఈ టీకా పంపిణీపై సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్ నిపుణులు సూచనలను పరిశీలించి.. తుది ప్రకటన చేయనుంది. మరోవైపు చైనాతో సహా కొన్ని దేశాలు ఇప్పటికే 12 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్‌లు వేస్తున్న సంగతి తెలిసిందే. 

ఎఫ్‌డీఏ నిర్ణయంతో పిల్లల వ్యాక్సిన్‌ను వైద్యల కార్యాలయాలు, ఫార్మసీలు, ఇతర టీకా కేంద్రాలను శనివారం నుంచి రవాణాల చేయనున్నట్టుగా ఫైజర్ సంస్థ తెలిపింది. సీడీసీ తన తుది ప్రకటన చేసిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్టుగా పేర్కొంది. అయితే ఫైజర్ పిల్లల టీకాను.. చిన్నారులకు మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. 

Also read: కొవాగ్జిన్‌‌పై అదనపు వివరణలు కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇంకా పెండింగ్‌లోనే..

‘వృద్ధుల కంటే పిల్లలు కరోనా వైరస్తో అనారోగ్యం, మరణానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంది. అయినప్పటికీ 5 నుంచి 11 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఇప్పటికీ తీవ్రంగా ప్రభావితమయ్యారు. క‌రోనా మ‌హ‌మ్మారి మొదలైన నాటి నుంచి 5 నుంచి 11 ఏళ్ల వ‌య‌సున్న వారిలో 8300 మంది చిన్నారులు ఆస్ప‌త్రి పాల‌య్యారు. వారిలో 146 మరణాలు నమోదయ్యాయి’అని ఎఫ్‌డీఐ తెలిపింది. 

Also read: చైనాలో మళ్లీ కరోనా ఆంక్షల పర్వం.. 11 ప్రావిన్సుల్లో కేసుల పెరుగుదల

ఇక, 5 నుంచి 11 ఏళ్ల పిల్లల కోసం తాము రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని.. ఇదే విషయం క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైందని గత నెలలో పైజర్ సంస్థ వెల్లడించింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న వేల పిల్లలకు వైరస్ నుంచి రక్షణ అందించేందుకు తాము చూస్తున్నామని అన్నారు.

ఇక, ఈ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా.. 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు గల 2,268 మందికి రెండు డోసుల టీకా ఇచ్చారు. ఈ టీకా వారిలో ప్రభావ వంతంగా పనిచేసిందని సంస్థ తెలిపింది. అయితే పెద్దవారికి, 12 ఏళ్లు పైబడినవారికి ఇస్తున్న మోతాదుతో పోల్చితే ఇది తక్కువగా ఉంటుంది. ఇక, ప్రస్తుతం 2 నుంచి 5 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు టీకా అభివృద్ది పనిలో ఉన్నట్టుగా ఫైజర్ వెల్లడించింది. 18 ఏళ్ల దాటిన వారికి, 12-18 ఏళ్ల వారికి టీకాలను ఇప్పటికే ఫైజర్ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios