ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక షాకింగ్ ఘటన సంభవించింది. 11ఏళ్ల కుర్రవాడు తండ్రయ్యాడు. అవును నిజమే 11 ఏళ్ల పిల్లోడి తండ్రయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎం చేయాలో అర్థం కాక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

వివరాల్లోకెళితే, ఫ్లోరిడాలో నివసించే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఆఫీసుకు వెళ్తుండడంతో ఇంట్లో పిల్లలిద్దరినీ వదిలేయాల్సి వస్తుంది. ఇలా కేవలం పిల్లలిద్దరినీ రోజూ వదిలేసి వెళుతూ ఉండడం వారికి అంతగా నచ్చక ఒక కేర్ టేకర్ కోసం వేదికడం ఆరంభించారు. 

ఈ సమయంలోనే తెలిసిన వారి ద్వారా మరిస్సా మోరీ అనే యువతి ఈ వీరి వద్ద ఆయా లాగా పనిచేయడానికి ఒప్పుకుంది. 2014లో ఈ కుటుంబం వద్ద మరిస్సా పని చేయడం ఆరంభించింది. 

ఆమె అదే ఏడాది ఒక పిల్లాడికి జన్మనిచ్చింది. తండ్రెవరని ఆ కుటుంబం కూడా అడగలేదు. అది ఆ యువతీ పర్సనల్ విషయం అని ఆ కుటుంబం భావించింది. కొన్ని రోజుల తరువాత తమ 11ఏళ్ల కొడుకు ఆ చిన్నపిల్లాడిని ఆడిస్తూ అధిక సమయం గడపడం, చేష్టలు విపరీతంగా ఉండడం వల్ల అనుమానం వచ్చిన ఆ కుటుంబం వారిద్దరిని నిలదీసింది. 

దాంతో ఇరువురు వారి మధ్య ఉన్న లైంగిక సంబంధానికి ప్రతిరూపమే ఈ పిల్లాడని చెప్పడంతో అందరూ షాక్ కు లోనయ్యారు. దీనితో ఆ సదరు కుటుంబం కోర్టు మెట్లెక్కింది. ఆ పిల్లాడి బలవంతం చేశాడన్న మరిస్సా వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆమె కావాలనే కామ పిశాచిలా ప్రవర్తించి ఆ పిల్లాడితో సెక్స్ చేసిందని కోర్టు నమ్మింది. దాదాపు 3సంవత్సరాలపాటు వారిరువురి మధ్య ఈ తతంగం జరిగిందని కోర్టు నిర్ధారించింది. 

లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం అభం శుభం తెలియని ఒక పిల్లాడిని తండ్రిని చేసినందుకు కోర్టు ఆమెకు 20ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఆమెకు పుట్టిన కొడుకు బాగోగులను 17సంవత్సరాల తండ్రి చూసుకుంటున్నాడు.