Russia Ukraine war: ఉక్రెయిన్‌లోని  బుచాలో రష్యన్ దురాగతాలకు ప్ర‌తిస్పంద‌న‌గా.. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకే యూరోపియ‌న్ యూనియ‌న్ చ‌ర్య‌లు తీసుకుంది. ఇందులో భాగంగా..  పుతిన్‌ కుమార్తెలిద్దరిపై యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించింది. వారితో పాటు..200 మందికి పైగా ఇతర వ్యక్తులను EU బ్లాక్‌లిస్ట్ లో పెట్టింది. ఈ లిస్టులో ఉన్నవారి ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు వీరి ప్రయాణాలపై నిషేధాన్ని విధించారని ఈయూ అధికారులు తెలిపారు.  

Russia Ukraine war: ఉక్రెయిన్‌లో ర‌ష్యా దాడిని ప్ర‌పంచ దేశాలు వ్య‌తిరేకిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని బుచాలో రష్యన్ దురాగతాలకు ప్ర‌తి చ‌ర్య‌గా..పుతిన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకే చర్యలు తీసుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. పుతిన్ కుమార్తెలు మరియా వొరంత్సోవా, కాటెరినా టిఖోనోవాలకు కూడా తాజా ఆంక్షలు వర్తిస్తాయని అమెరికా ప్రకటించింది. ఇదే త‌రుణంలో పుతిన్‌ కుమార్తెలిద్దరిపై యూరోపియన్‌ యూనియన్‌ EU ఆంక్షలు విధించింది. 

రష్యాను నిలవరించేందుకు పలు కంపెనీలపై, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ఈయూ తాజాగా మరి కొందరితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా.. పుతిన్ ఇద్దరు కుమార్తెలు, 200 మందికి పైగా ఇతర వ్యక్తులను EU బ్లాక్‌లిస్ట్ లో పెట్టింది. ఈ లిస్టులో ఉన్నవారు యూరోపియన్ యూనియన్ దేశాల్లోని ఆస్తుల స్వాధీనం, ప్రయాణ నిషేధాలను ఎదుర్కొంటున్నారు.

అధికారికంగా.. లియుడ్మిలా పుతినాతో పుతిన్ వివాహం జ‌రిగింది. వీరికి మరియా వొరోంట్సోవా, కాటెరినా టిఖోనోవా అనే ఇద్దరు పిల్లలు. 1985లో జన్మించిన పెద్ద కుమార్తె మరియా వోరోంట్సోవా, ఒక సంవత్సరం తర్వాత డ్రెస్డెన్‌లో పుట్టిన కాటెరినా టిఖోనోవా. వోరోంట్సోవా ఇప్పుడు విద్యావేత్త అని, ఎండోక్రైన్ వ్యవస్థలో ప్రత్యేకత కలిగి ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. అయితే.. పుతిన్ త‌న భార్య లియుడ్మిలా నుండి 2013లో విడాకులు తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి..

పెద్ద కుమార్తె మారియా వ్లాదిమిరోవ్ (36) పిడియాట్రిక్ ఎండ్రోకైనాలజిస్ట్. ఆమె సెయింట్ పీటర్స్ బర్గ్ యూనివర్సిటీలో బయాలజీ, మాస్కో స్టేట్ యూనివర్సిటీలో మెడిసిన్ చదివారు. జెనెటిక్స్ రీసెర్చ్ చేస్తున్నార‌ట‌. వైద్య సంస్థ నోమెన్కో సహ యజమాని కూడా. చిన్న పిల్లలకు వచ్చే అరుదైన వ్యాధులపై మారియా ప‌రిశోధ‌న‌లు చేస్తుందట‌. డచ్ వ్యాపారి జూస్ట్ ఫాస్సెన్ ను వివాహం చేసుకున్నారు. రష్యా లో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్‌ ప్రాజెక్ట్ నోమెన్‌కో కి వోరోంట్సోవా సహ-యజమాని అయినందున .. ఆమె పేరు జాబితాలో ఉంద‌ని EU తెలిపింది.

ఇక రెండో కుమార్తె కేథరీనా వ్లాదిమిరోవ్ (35) టెక్ ఎగ్జిక్యూటివ్. మాస్కో స్టేట్ యూనివర్సిటీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇనిస్టిట్యూట్ కు అధిపతిగా ఈమెను 2020లో నియమించారు. ఈమె ఆక్రోబాటిక్ డ్యాన్సర్ కూడా. ఆమె నెట్ వర్త్ 2020 నాటికి 2 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.. ఈమె కిరిల్ షమలోవ్ ను వివాహం చేసుకుంది. ఆయ‌న‌ బ్యాంక్ రష్యాలో భాగ‌స్వామి. ప్రస్తుతం ఆమె ఇన్నోప్రాక్టికా అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తుంది, దీని డైరెక్టర్లు అధ్యక్షుడు పుతిన్‌కు సన్నిహితులైన ఒలిగార్చ్‌ల అంతర్గత సర్కిల్‌లో సభ్యులుగా ఉన్న కీలకమైన రష్యన్ కంపెనీలచే నిధులు సమకూరుస్తున్నారు. అందువల్ల ఆమెను EU జాబితాలో చేర్చిన‌ట్టు తెలుస్తోంది. 

ఇక పుతిన్ సంతానం సహా మొత్తం 217 మంది వ్యక్తులు EU బ్లాక్ లిస్ట్‌లో చేర్చబడ్డారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్నవారు: హెర్మన్ గ్రెఫ్, రష్యాలోని అతిపెద్ద లిస్టెడ్ బ్యాంక్, స్బేర్‌బ్యాంక్ అధిపతి, ఒలేగ్ డెరిపాస్కా- ఆయుధ కర్మాగారాలకు అధిప‌తి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇగోర్ కోనాషెంకోవ్, పుతిన్‌కు దగ్గరగా ఉన్న అత్యంత సంపన్నమైన రోటెన్‌బర్గ్ కుటుంబానికి చెందిన మరింత మంది సభ్యులు, తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాద రష్యన్-మద్దతుగల ఎన్‌క్లేవ్‌లను నడుపుతున్న రాజకీయ పరిపాలన సభ్యులు ఈ బ్లాక్ లిస్టులో ఉన్నారు. 

యూరోపియన్ యూనియన్ ఇప్పటికే పుతిన్ ఆస్తుల‌పై స్తంభనను విధించింది. అలాగే.. ఉక్రెయిన్‌లో రష్యా క్రూర చర్యలకు పాల్పడిందన్న వార్తలకు సాక్ష్యాలున్నాయంటూ ఈయూ తాజా ఆం క్షల జాబితాను విడుదల చేసింది. ఇప్ప‌టికే EU రష్యన్ బొగ్గు దిగుమతులను నిషేధిస్తుంది, యూరోపియన్ నౌకాశ్రయాల్లోకి రష్యన్ నౌకలు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. రష్యా ఆర్థిక, వాణిజ్యంపై ఆంక్షలను విస్తరించింది.