వార్నీ.. లాటరీలో లోపాన్ని కనిపెట్టి.. రూ.200 కోట్లు సంపాదించిన వృద్ధజంట.. ఎలాగంటే..

జెర్రీ సెల్బీ అనే రిటైర్డ్ ఉద్యోగి.. 2003లో విన్‌ఫాల్ అనే కొత్త లాటరీ గేమ్ బ్రోచర్‌ను చూశాడు. అదే అతని జీవితాన్ని మార్చేసింది. నోటి లెక్కలతో రూ. 200 కోట్లు సంపాదించాడు. 

elderly couple earned Rs. 200 crores by finding a mistake in the lottery in USA - bsb

మ్యాథ్స్ అంటేనే చాలామందికి ఒంట్లో వణుకు పుడుతుంది. లెక్కల సబ్జెక్టును గట్టెక్కేసరికి బతుకు జీవుడా అనుకుంటారు విద్యార్థులు. అయితే, గణితం తెలిస్తే గగనాన్ని జయించవచ్చని చెబుతారు పెద్దలు. ఓ వృద్ధ జంట మాత్రం గణితంతో దాదాపు రూ. 200 కోట్ల రూపాయల లాటరీలను దక్కించుకున్నారు. పూర్తిగా అదృష్టం మీద ఆధార పడుతుందని నమ్మే లాటరీలో.. కాస్త తెలివిగా లెక్కలు వేసి లాటరీలను కైవసం చేసుకున్నారు.

జెర్రీ సెల్బీ, మార్జి సెల్ఫీ అనే ఇద్దరు 60 ఏళ్లకు పైబడిన దంపతులు.. 2003లో రిటైర్ అయ్యారు. ఖాళీగా ఇంట్లో కూచున్న సమయంలో జెర్రీకి  నెంబర్ల ఆట అయిన లాటరీ మీద దృష్టి పెట్టే అవకాశం దొరికింది.  ఇదంతా అంకెల గారడి అని, కాస్త బుర్ర పెడితే గెలవచ్చని  అనుకున్నాడు. ఇంకేం రిటైర్ అయిన తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని  తాముంటున్న మిచిగాన్ రాష్ట్రంలోని విన్ ఫాల్ లాటరీలను గమనించడానికి వెచ్చించాడు.

మళ్లీ షేక్ హసీనాకే బంగ్లాదేశ్ పగ్గాలు.. ఎన్నికల్లో నాలుగోసారి ఘన విజయం..

విన్ఫాల్ లాటరీలు స్థానికంగా నిర్వహిస్తారు. వీటిలో జాక్పాట్ ఎలా తగులుతుంది? ఎవరు, ఎప్పుడు, ఎలా ఓడిపోతున్నారు? ఒక్కో టికెట్ కు ఎంత ఖర్చవుతుంది? ఒకవేళ జాక్పాట్ కనక ఎవరికి రాకపోతే ఏమవుతుంది? అనే విషయాలను జాగ్రత్తగా గమనించాడు. ఆయన చేసిన పరిశోధనలో ఒక క్రమ పద్ధతిలో టికెట్లు కొంటే లాటరీ గెలుచుకోవచ్చని అర్థమైంది. తనకు అర్థమైనదాన్ని ఆచరణలో చూపించాడు జెర్రీ. పక్కాగా లెక్కలు వేసి మరీ టికెట్లు కొన్నాడు. జెర్రీ అంచనాలు నిజమయ్యాయి.  అదృష్టం లాటరీ రూపంలో తలుపు తట్టింది.

విన్ ఫాల్ లాటరీలో లెక్కల పరంగా కొన్ని లొసుగులు ఉన్నాయి. వాటిని ఒడిసి పట్టుకున్నాడు జెర్రీ. ఇంకేముంది వరుస పెట్టి లాటరీలు కొట్టడం ప్రారంభించాడు. మామూలుగా అయితే లాటరీ ఏజెన్సీలు ఇలాంటి లోటుపాట్లు లేకుండా ఎంతో పకడ్బందీగా ఉంటాయి. కానీ విన్ ఫాల్  సంస్థ చేసిన ఓ చిన్న  పొరపాటుతో.. జెర్రీ ప్రతి ఆరువారాలకు ఒకసారి ఎంతో కొంత గెలుచుకునేవాడు. రిటైర్ అయిన తర్వాత ఓ వ్యాపకంలా దీన్ని స్వీకరించిన జెర్రి మొదట్లో కొంత డబ్బు పోగొట్టుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆటను జాగ్రత్తగా పరిశీలించడంతో మళ్లీ ఎప్పుడు డబ్బులు  పోగొట్టుకోలేదు అన్నాడు.

మొదటిసారిగా  2200 డాలర్లకోసం లాటరీలో ఆడాడు. కానీ ఆయన అంచనాలు తప్పి నష్టపోయాడు. అయితే, రెండోసారి మూడు లక్షల కోసం ప్రయత్నించాడు. కానీ ఇది ఆయన అంచనాలను మించి ఐదు లక్షలు వచ్చి పడ్డాయి. అక్కడితో ఊరుకోకుండా మూడోసారి ఆడితే  12 లక్షలు దొరికాయి. దీంతో తన అంచనాలు నిజం అవుతున్నాయి అన్న సంతోషం పెరిగింది. కానీ, ఈ విషయం భార్యకు తెలిస్తే.. ఏమంటుందోనని ఆమెకు తెలియకుండా ఆడేవాడు. దీని కోసం పెద్ద మొత్తంలో ఖర్చు కూడా పెట్టేవాడు. అలా రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులను మొత్తం లాటరీకే ఖర్చు పెట్టాడు.

కానీ టికెట్లపై పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ మొత్తం లాభాలు రావడంతో ఆ విషయం పెద్దగా తెలియలేదు. లాభాలు రావడం మొదలైన తర్వాత ఇక భార్యతో ఈ విషయాన్ని చెప్పేశాడు. భార్య కూడా భర్త గణిత పాండిత్యం మీద నమ్మకంతో తాను కూడా లాటరీ రంగంలోకి దిగింది. అలా ఆ జంట మొత్తంగా 26 మిలియన్ డాలర్లను లాటరీ రూపంలో సంపాదించుకున్నారు. రిటైర్ అయిన తర్వాత వారి సంపాదన పెరిగిపోతుండడంతో అనుమానం వచ్చిన కొంతమంది ఆరాతీయగా ఈ విషయం వెలుగు చూసింది.

చట్టపరంగా తప్పులు ఏమి చేయకుండానే వారు ఈ డబ్బును సంపాదిస్తుండడంతో ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. అయితే, తాను గమనించిన చిన్న పొరపాటు మిగతా వారికి అర్థం కాకపోవడమే అతనికి మరింత ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయం వైరల్ గా మారడంతో వారి జీవితం ఆధారంగా ‘జెర్రీ అండ్ మార్జ్ గో లార్జ్’ అనే పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది.  బ్రియాన్ క్రాన్ స్టన్ నటించిన ఈ  సినిమా  హిట్ కూడా అందుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios