సిరియా మరో సారి పేలుళ్లతో దద్దరిల్లింది. సిరియా దేశంలోని సూలుక్ గ్రామంలో కారు బాంబు పేలిన ఘటనలో 8 మంది మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సూలుక్ గ్రామంలో బేకరి వద్ద ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 8 మంది మరణించగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారని టుర్కిష్ రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు.

కాగా.. వారం రోజుల క్రితం కూడా సిరియాలో ఇదే రకం పేలుళ్లు సంభవించాయి. సిరియా దేశంలోని అజాజ్ నగరంలోని సెంట్రల్ సిటీ ప్రాంతంలోని జనసమ్మర్థం అధికంగా ఉన్నపుడు కారును డిటనేటర్లతో పేల్చివేశారు. ఈ ఘటనలో 14 మంది మరణించగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ పేలుడులో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.రఖ్కా నగరంలోని కమాండ్ సెంటరు వద్ద కుర్ధిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్ కారు బాంబు పేల్చివేతలో పదిమంది మరణించారు. ఈ ఘటన జరిగిన మరునాడే అజాజ్ నగరంలో గుర్తుతెలియని వ్యక్తులు కారును డిటోనేటర్లతో పేల్చివేశారు. ఈ పేలుళ్ల ఘటన మరిచిపోకముందే మరోసారి పేలుళ్లు సంభవించడం గమనార్హం.