ఇండోనేషియాలో ఆదివారం భూకంపం సంభవించింది. ఉత్తర మలక్కా ప్రాంతంలో ఉదయం ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. టెర్నెట్‌‌కు 150 కిలోమీటర్ల దూరంలో 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. అయితే అతి తక్కువ సమయం మాత్రమే ప్రకంపనలు చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.