Asianet News TeluguAsianet News Telugu

పొట్ట తీయకపోతే చావు తప్పదన్న డాక్టర్లు... చివరిసారి బిర్యానీ పెట్టమన్న పేషేంట్..!!

ఒకే పేషేంట్ కోరిన కోరికను నెరవేర్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు డాక్టర్లు. గులామ్ అబ్బాస్ అనే ఇంజనీర్ ఒక్కసారిగా వాంతులు, భారీగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతూ.. వైద్యుల వద్దకు వెళ్లాడు

dubai man suffering stomach cancer and asking biryani for last time
Author
Dubai - United Arab Emirates, First Published Sep 25, 2018, 10:37 AM IST

ఒకే పేషేంట్ కోరిన కోరికను నెరవేర్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు డాక్టర్లు. గులామ్ అబ్బాస్ అనే ఇంజనీర్ ఒక్కసారిగా వాంతులు, భారీగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతూ.. వైద్యుల వద్దకు వెళ్లాడు.

అతన్ని పరీక్షించిన డాక్టర్లు... నీకు పొట్ట క్యాన్సర్ అని... అది ప్రస్తుతం మూడో స్టేజ్‌లో ఉందని.. ఇప్పటికే కడుపు మొత్తం పాకేసిందని.. ఇక బతకడం కష్టమని చెప్పారు. అంతేకాకుండా బతకాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో పొట్టను తీసేయాల్సిందేనని తేల్చి చెప్పారు..

పొట్ట లేకుండా జీవించడం.. లేదంటే చనిపోవడం రెండే మార్గాలున్నాయన్నారు.. డాక్టర్లు చెప్పిన వార్తకు కన్నీరుమున్నీరైన అబ్బాస్.. తన పిల్లలు తాను లేకుండా బతకలేరని.. వారు సాధించిన విజయాలను చూడాలని కోరుకుంటున్నానని.. పొట్టను తొలగించమని చెప్పాడు..

అయితే సర్జరీ చేసేముందు వారిని ఒక కోరిక కోరాడు. జన్మలో తనకు ఇష్టమైన తన భార్య చేసే బిర్యానీ తినడం కుదరదు కాబట్టి.. పొట్టను తొలగించే ముందు చివరి సారిగా బిర్యానీ తినాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అబ్బాస్ కోరికను డాక్టర్లు నెరవేర్చారు..

అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు. పొట్ట లేకుండా అబ్బాస్ ఎలా బతుకుతాడని... అంటే అసలు అతను ఏమీ తినలేడని కాదు.. చాలా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోగలడని డాక్టర్లు చెబుతున్నారు. పొట్ట లేకుండా ఉన్న వారు తీసుకునే ఆహారాన్ని అన్నవాహిక నుంచి నేరుగా చిన్న ప్రేగులకు తరలించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios