Asianet News TeluguAsianet News Telugu

శత్రువులను పులులకు ఆహారంగా వేశారు.. మిరపకాయలతో టార్చర్ పెట్టారు.. ఆ డ్రగ్స్ ముఠా దారుణాలు

ఎల్ చాపోకు చెందిన డ్రగ్స్ ముఠా సభ్యులు, ఆయన కొడుకు శత్రవులను దారుణంగా  టార్చర్ పెట్టేవారని యూఎస్ శాఖ ఒకటి తెలిపింది. శత్రువులను సజీవంగానే పులులకు ఆహారంగా వేశారని, మిరపకాయలు, కార్క్‌స్క్రూలతో వర్ణనాతీతంగా టార్చర్ పెట్టేవారని వివరించింది.
 

drugs cartel founder El Chapo sons cruel tortures enemies, fed alive to tigers kms
Author
First Published Apr 22, 2023, 11:45 PM IST

న్యూఢిల్లీ: చట్టం కళ్లుగప్పి చీకటిలో విస్తరించిన డ్రగ్స్ సామ్రాజ్యానికి కింగ్‌గా మెదిలిన ఒవాక్విన్ ఎల్ చాపో గుజ్మన్ ముఠా దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఎల్ చాపో కొడుకులు శత్రువులను దారుణంగా చిత్రహింసలు చేసినట్టు తెలుస్తున్నది. శత్రువులకు కరెంట్ షాక్ ఇవ్వడం, మిరపకాయలతో టార్చర్ పెట్టినట్టు ఈ శాఖ వెల్లడించింది. అంతేకాదు, కొందరు శత్రువులను సజీవంగా లేదా మరణించిన తర్వాత పులులకు మేతగా వేసినట్టు తెలిపింది.

సీబీఎస్ న్యూస్ ప్రకారం, ఫెంటానైల్ (ఒక రకమైన డ్రగ్స్) ట్రాఫిక్ ఆపరేషన్ ఆరోపణలతో ఒవిడియో గుజ్మాన్ లోపేజ్, జీసస్ అల్ఫ్రెడో గుజ్మాన్ సలాజర్ సహా 28 మందిపై ఆరోపణలు మోపారు. ఈ ఆరోపణల్లో అనాగరిక రీతుల్లో టార్చర్ పెట్టినట్టు, చంపేసినట్టు పేర్కొన్నారు. వారి అధికారాన్ని విస్తరించడానికి, శత్రువులను బెదిరించడానికి ఈ పాశవిక దారులను ఎంచుకున్నట్టు తెలుస్తున్నది.

శత్రువుల సమాచారం రాగానే.. చాపిటోల ఆదేశాల మేరకు లేదా వారే స్వయంగా దారుణంగా టార్చర్ పెట్టేవారు లేదా చంపేసేవారు. ఆ డెడ్ బాడీలను వారి ఏరియాలో ఎక్కడపడితే అక్కడే పడేసేవారు. లేదా పులులకు సజీవంగా లేదా చంపేసిన తర్వాత ఆహారంగా వేసేవారని ఆ ఇండిక్ట్‌మెంట్ తెలిపింది.

Also Read: Karnataka Election 2023: క‌ర్నాట‌క కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి..? : మల్లికార్జున ఖ‌ర్గే కీల‌క వ్యాఖ్యలు

2017లో ఓ బాధితుడిని అత్యంత దారుణంగా టార్చర్ చేశారు. కార్క్‌స్క్రూ అనే పరికరం ద్వారా ఆ బాధితుడి మాంసాన్ని తొలుస్తూ లోపలికి చొప్పించారు. మళ్లీ బయటకు ఆ మాంసాన్ని చింపేస్తూ బయటకు తీశారు. గాయాలపై, ముక్కుపై మిరపకాయలు పెట్టారు. 

కరెంట్ షాక్ ఇవ్వడం, వాటర్ బోర్డింగ్ చేయడం వంటి నేరాలనూ వారు చేశారు. ప్రత్యర్థి డ్రగ్స్ ముఠా సభ్యులపై లేదా డబ్బులు ఇవ్వని వారిపై ఈ దాడులు చేసేవారని ఓ కథనం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios