అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రోన్ దాడి జరిగింది. మూడు ఇంధనంతో వెళ్తున్న ట్యాంకర్లను  లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిందని అనుమానిస్తున్నారు.

దుబాయి: Abu Dhabi అంతర్జాతీయ Airportలో డ్రోన్ దాడి జరిగింది. అబుదాబి ఎయిర్ పోర్టులో మూడు ఇంధనంతో వెళ్తున్న ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. యెమెన్ యొక్క ఇరాన్ మద్దతు గల హౌతీలు ఈ ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించారు.హౌతీ మిలటరీ ప్రతినిధి యూహియా సారీ మీడియాతో మాట్లాడారు. తమ బృందం యూఏఈలో లోతైన దాడిని ప్రారంభించిందన్నారు. అయితే తర్వలోనే పూర్తి వివరాలను అందిస్తామని చెప్పినట్టుగా ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

2019 సెప్టెంబర్ 14న Saudi Arabia లోని రెండు కీలక చమురు స్థావరాలను యెమెన్ కు చెందిన Houthi తిరుగుబాటు దారులు దాడులు చేశారు. ఈ దాడుల వల్లే పర్షియన్ గల్ప్ లో ఉద్రిక్తతలు పెరిగాయి.Drone దాడితో మూడు Fuel Tankerలో మంటలు వ్యాపించాయి. అంతేకాదు UAE కొత్త విమానాశ్రయంలో మంటలు వ్యాపించినట్టుగా పోలీసులు తెలిపారు. ముసఫా ప్రాంతంలోని మూడు ఇంధన ట్యాంకర్లు పేలిపోయాయని పోలీసులు వివరించారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే డ్రోన్ గా ఉండే చిన్న విమానం భాగాలు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపైదర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

యూఏఈ మద్దతున్న సంకీర్ణ అనుకూల దళాలు యెమెన్ లోని షాబ్వా, మారిబ్ లలో హౌతీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. 2019లో యూఏఈ యెమెన్ లో తన సైనిక ఉనికిని చాలా వరకు తగ్గించింది. హౌతీలు సౌదీ అరేబియాపై సరిహద్దు క్షిపణి, డ్రోన్ దాడులను పదే పదే చేస్తున్నాయి. గతంలో కూడా యూఏఈపై దాడి చేస్తామని బెదిరించిన విషయం తెలిసిందే.

ఇటీవల కాలంలో హౌతీలు స్వాధీనం చేసుకొన్న ర్వాబీ నౌకలో ఉన్న ఏడుగురు భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ గత వారం ప్రకటించింది. ఈ నెల 2న హౌతీలు ర్వాబీ ఓడను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటన తర్వాత పరిణామాలను ఇండియా నిశితంగా పరిశీలిస్తొంది., హౌతీలు, సౌదీల మధ్య సుదీర్ఘకాలంగా సంఘర్షణ కొనసాగుతుంది.