Asianet News TeluguAsianet News Telugu

డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ కు కరోనా పాజిటివ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది.  ట్రంప్ సలహాదారుణికి  పనిచేస్తున్న హూప్ హిక్సుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ట్రంప్, మెలానియా కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నారు. 

Donald Trump, Melania tests possitive for Covid-19, after top aide tests positive for coronavirus
Author
Hyderabad, First Published Oct 2, 2020, 10:42 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది.  ట్రంప్ సలహాదారుణికి  పనిచేస్తున్న హూప్ హిక్సుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ట్రంప్, మెలానియా కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నారు. 

ట్రంప్ సలహాదారిణిగా పనిచేస్తున్న హూప్ హిక్సు ట్రంప్‌తో కలిసి ఈ వారంలో ప్రెసిడెన్షియల్ హెలికాప్టర్ మెరైన్‌వన్, ఎయిర్‌ఫోర్స్ వన్ మిన్నెసోటాలో ప్రయాణించారు. 

ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులు తాజాగా కరోనా పరీక్ష చేయించుకున్నారు. పరీక్షా ఫలితాన్ని బట్టి క్వారంటైన్‌లోకి వెళతామని ట్రంప్ ట్వీట్ చేశారు. కరోనా సోకిన హూప్ అధ్యక్షుడు ట్రంపుతో కలిసి పలుసార్లు ప్రయాణించినందున అధ్యక్షుడి ఆరోగ్యం గురించి పర్యవేక్షిస్తున్నామని వైట్ హౌస్ ప్రతినిధి జాడ్ డీర్ చెప్పారు. అయితే పరీక్షా ఫలితాల్లో ట్రంప్ కు, మెలానియాకు పాజిటివ్ అని తేలడంతో క్వారంటైన్ లోకి వెళ్లారు. 

 

అంతకుముుందే ట్రంప్ ట్వీట్ చేస్తూ.. తానూ, మెలానియా ట్రంప్ కొవిడ్-19 పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని, ఈ సమయంలో తాము క్వారంటైన్ లో ఉన్నామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘చిన్న విరామం కూడా తీసుకోకుండా చాలా కష్టపడి పనిచేస్తున్న హోప్ హిక్సుకు కొవిడ్- 19  పాజిటివ్ అని తేలింది. అందుకే నేను, నా భార్య మెలానియాలు కొవిడ్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. ఈలోగా, మేం క్వారంటైన్  లో ఉంటున్నాం’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios